ఆదివారం, 04 అక్టోబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

స్థానిక సంస్థల ఎన్నికల్లో వైసిపి విజయం సాధించడం ఖాయం : మాజీ శాసనసభ్యులు బొత్స అప్పల నరసయ్య

1 గంట క్రితం

YCP's victory in the local body elections is certain: Former MLA Botsa Appala Narasayya.
వెబ్ డెస్క్

ప్రచురించబడింది అక్టో 04, 2026, 04:06 అపరాహ్నం | 2 నిమిషాల చదవడం

* విద్యా కమిటీ ఎలక్షన్లలో అక్రమాలను ఎండగట్టిన మాజీ శాసనసభ్యులు బొత్స

* వైసీపీ సానుభూతిపరుల పశువులపై విష ప్రయోగంపై ఆగ్రహం వ్యక్తం చేసిన మాజీ ఎమ్మెల్యే బొత్స అప్పల నరసయ్య


ప్రజాశక్తి - గజపతినగరం (విజయనగరం) : నియోజకవర్గ కేంద్రలో ఉన్న వైసిపి పార్టీ కార్యాలయంలో స్థానిక వైఎస్ఆర్సిపి మాజీ శాసనసభ్యులు బొత్స అప్పల నరసయ్య ఆదివారం పత్రిక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... గత నెల రోజులుగా వైఎస్ఆర్సిపి పార్టీలో జరుగుతుంది రాజకీయ పరిణామాలను వివరిస్తూ జిల్లాలో వైఎస్ఆర్సిపి నుంచి ఏ ఒక్క నాయకుడు వెళ్లినంత మాత్రాన పార్టీకి బలం తగ్గింది అనడం అనుకోవడం అమాయకత్వం అని అన్నారు. కార్యకర్తలు ఎప్పుడు పార్టీని నమ్ముకుని పార్టీతోనే ఉన్నారు ఉంటారు అని అన్నారు. అదేవిధంగా గజపతినగరం నియోజకవర్గంలో కొంతమంది పార్టీని వీడి వెళ్లినప్పటికీ వాళ్ల స్వార్థ ప్రయోజనాలకే వెళ్లారు తప్ప మరో ఉద్దేశం కాదని అన్నారు. వారి వెంట కొంతమంది మినహాయించి ఏ ఒక్క నాయకుడు, కార్యకర్త కూడా వెళ్ళలేదు అని విమర్శించారు. ఇక జిల్లాలో వైఎస్సార్సీపీ బలం ఏ మాత్రం తగ్గలేదు అని దీనికి నిదర్శనం గత మూడు రోజులు కిందట జరిగింది విద్యా కమిటీ ఎన్నికలు అని అన్నారు. ఎక్కడ చూసినా కూటమి పార్టీలకు దీటుగా చాలా బలంగా వైఎస్సార్ సీపీ నాయకులు కార్యకర్తలు నిలబడి పార్టీ బలాన్ని చూపించారని చాలా చోట్ల విజయాలు కూడా సాధించామని అన్నారు. సోమవారం లోగిస గ్రామంలో విద్యా కమిటీ ఎన్నికలు నిర్వహణకు అంతా సిద్ధంగా ఉన్నప్పటికీ ఎన్నికల నిర్వహణ సజావుగా జరగకుండా టిడిపి నాయకులు కోరం సరిపోవటం లేదు అని చెప్పి వాయిదా వేయడం ఎంతవరకు సమాజసం అని ప్రశ్నించారు. కోరం సరిపోయినప్పటికీ సరిపోలేదని అబద్ధపు మాటలు ఆడి ఎన్నికలు వాయిదా వేయడం ప్రజాస్వామ్య కొని చేయడమే అని అన్నారు. అదేవిధంగా గంట్యాడ మండలం పెంట శ్రీరామ్ పురం గ్రామంలో జడ్పీ హైస్కూల్ హెచ్ ఎం ఎన్నికలు నిర్వహించలేను అని ప్రభుత్వానికి చెబితే కనీసం బాధ్యత తీసుకొని ఎన్నికలు నిర్వహించ లేని పరిస్థితుల్లో ప్రభుత్వం ఉందా అని ప్రశ్నించారు. హెచ్ఎం చేతిలో నుంచి ఎన్నికలు నిర్వహణకు సంబంధించిన కాయితాలు లాగుకొని టిడిపి గ్రామస్థాయి నాయకులు చింపేస్తే పోలీసులు కంప్లైంట్ ఎందుకు ఇవ్వలేదు అని ప్రశ్నించారు. నందం గ్రామానికి చెందిన సుమారు 70 ఎకరాలు డి పట్టా భూములు స్థానిక మంత్రి కంపెనీకి ఇవ్వాలని లాలూచీ కుదుర్చుకొని రైతులకు అన్యాయం చేస్తున్నారని ఆరోపించారు. పెంట శ్రీరామ్ పురం గ్రామానికి చెందిన వైఎస్ఆర్సిపి సానుభూతిపరులు సంబంధించిన రెండు ఆవులను తాగే నీటిలో విషం ఇచ్చి చంపేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. స్వార్థపు రాజకీయ ప్రయోజనాల కోసం మూగ జీవులను చంపేయడం ఎంతవరకు సబబు అని ఈ విషయంపై స్థానిక మంత్రి, ప్రభుత్వ పెద్దలు స్పందించి ఈ విషయంపై ఖండించవలసిన అవసరం ఎంతైనా ఉందని ఈ బాధ్యత మీపై లేదా అని ప్రశ్నించారు. నేటికీ కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేసి రెండున్నర సంవత్సరాలు గడుస్తున్నా స్థానిక మంత్రి జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఒక్కసారి అయినా వ్యవసాయానికి సంబంధించి ప్రస్తుత ఎల్ లీనో కరువుపరిస్థితులపై ఒక్క రివ్యూ మీటింగ్ అయినా నిర్వహించారా అని ప్రశ్నించారు. పూర్తిగా ప్రజలు ప్రభుత్వానికి ప్రభుత్వ విధానాలకి వ్యతిరేకంగా ఉన్నారని త్వరలో రాబోతున్న అన్ని ఎన్నికల్లో కచ్చితంగా మేము విజయం సాధిస్తామని ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు పల్లి సంజీవరావు, మాజీ పిఎసిఎస్ చైర్మన్ కరణం ఆదినారాయణ, మండల సీనియర్ నాయకులు మండల సురేష్, బెల్లానా తిరునాధరావు, కె పైడుపునాయుడు తదితరులు పాల్గొన్నారు.
YCP's victory in the local body elections is certain: Former MLA Botsa Appala Narasayya.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్