పాలకొల్లు (పశ్చిమ గోదావరి) : డాక్టర్ బాబ్జి పార్థివదేహాన్ని రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు సందర్శించి పూలమాల వేసి, నివాళులు అర్పించారు. డా బాబ్జి అంతిమయాత్రలో పాల్గొని, పాడెను మోశారు. ప్రభుత్వ అధికార లాంఛనాలతో అంత్యక్రియలను నిర్వహించారు. డా బాబ్జి మృతి విషయం సిఎం చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లి డా బాబ్జి పార్థివ దేహానికి, ప్రభుత్వ అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు జరిగేలా, అప్పటికప్పుడు ప్రత్యేక అనుమతి ఉత్తర్వులు ఇప్పించడంలో మంత్రి నిమ్మల రామానాయుడు చొరవ తీసుకున్నారు. ప్రముఖ వైద్యునిగా, రాజకీయంగా, విశిష్ట సేవలందించిన డా బాబ్జి అందరూ హృదయాల్లో శాశ్వతంగా నిలిచిపోతారని మంత్రి అన్నారు. డా బాబ్జి లాంటి వ్యక్తికి గౌరవం ఇవ్వడం అంటే, మనల్ని మనం గౌరవించుకున్నట్లే అని చెప్పారు. ఈ అంతిమ యాత్రలో మాజీ మంత్రి కొత్తపల్లి సుబ్బారాయుడు వైద్యులు డా కె ఎస్ ఎన్ వర్మ డా బలరాం , డా సంజయ్ పెద్ద ఎత్తున ఆయన అభిమానులు పాల్గొన్నారు.
అధికార లాంఛనాలతో ముగిసిన డాక్టర్ బాబ్జి అంత్యక్రియలు
2 గంటల క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది నవం 05, 2026, 03:33 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం
ట్యాగ్‌లు
సంబంధిత వార్తలు






కామెంట్‌లు (0)