న్యూఢిల్లీ : నాలుగు రాష్ట్రాలు, రెండు కేంద్ర పాలిత ప్రాంతాల్లో ఓటర్ల జాబితా ప్రత్యేక సంక్షిప్త సవరణ (ఎస్ఎస్ఆర్) చేపట్టనున్నట్లు ఎన్నికల సంఘం (ఈసి ) గురువారం ప్రకటించింది. అరుణాచల్‌ప్రదేశ్, మిజోరం, ఒడిశా, సిక్కిం రాష్ట్రాలతో పాటు రెండు కేంద్ర పాలిత ప్రాంతాలు (యుటి) దాద్రా నగర్ హవేలీ, డామన్ డయ్యూ ( దాద్రా నగర్ హవేలీ, డామన్ డయ్యూ రెండూ విలీనమై ప్రస్తుతం ఒకే కేంద్రపాలిత ప్రాంతంగా ఉన్నాయి), చండీగఢ్‌లలో ఎస్ఎస్ఆర్ చేపట్టనున్నట్లు ఈసి తెలిపింది. ఈ ప్రక్రియలో భాగంగా అర్హులైన ఓటర్ల పేర్లను జాబితాలో నమోదు చేయడంతోపాటు, ముఖ్యంగా యువత, మొదటిసారి ఓటు హక్కు వినియోగించుకోనున్న వారికి అవకాశం కల్పించనున్నట్లు తెలిపింది. 2027 ఏప్రిల్ 1, జులై 1, అక్టోబర్ 1 తేదీల నాటికి ఓటు హక్కుకు అర్హత పొందే వారి నుంచి కూడా ముందస్తు దరఖాస్తులను స్వీకరించనున్నట్లు వెల్లడించింది. ఓటర్ల ముసాయిదా జాబితాను నవంబర్ 30న, తుది ఓటర్ల జాబితాను 2027 జనవరి 21న ప్రచురించనున్నట్లు పేర్కొంది. ఈ సవరణ ప్రక్రియ సజావుగా సాగేందుకు అవసరమైన మానవ వనరులు, ఇతర వనరులను సమకూర్చుకోవాలని సంబంధిత రాష్ట్రాలు, యుటిల ప్రధాన కార్యదర్శులను ఈసి ఆదేశించింది.
నాలుగు రాష్ట్రాలు, రెండు యుటిల్లో ఓటర్ల జాబితా ప్రత్యేక సంక్షిప్త సవరణ (ఎస్ఎస్ఆర్)
1 గంట క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది నవం 05, 2026, 04:13 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం
ట్యాగ్లు
సంబంధిత వార్తలు






కామెంట్లు (0)