మంగళవారం, 20 అక్టోబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

ఆధార్ కార్డు కోసం వెళుతూ ప్రమాదం - మహిళ మృతి

15 గంటల క్రితం

Accident while heading for Aadhaar card – woman dies
వెబ్ డెస్క్

ప్రచురించబడింది అక్టో 19, 2026, 03:25 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

ప్రజాశక్తి - ముద్దనూరు (కడప) : ఆధార్ కార్డు పని నిమిత్తం అక్క, తమ్ముడు కలిసి స్కూటీపై వెళ్తుండగా వెనుక నుంచి లారీ ఢీకొన్న ఘటనలో తిరుపతమ్మ (34) మృతి చెందింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం .... సోమవారం కమలాపురం పట్టణానికి చెందిన తిరుపతమ్మ, ఆమె తమ్ముడు అంకయ్య ఆధార్ కార్డు పని నిమిత్తం కమలాపురం నుంచి స్కూటీ పై ముద్దనూరు మీదుగా జమ్మలమడుగుకు వెళుతున్నారు. స్కూటీ ముద్దనూరు లోని నాలుగు రోడ్లు కూడలి వద్దకు రాగానే వెనుక వస్తున్న లారీ వేగంగా వచ్చి స్కూటీని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో తిరుపతమ్మ తీవ్రంగా గాయపడింది. అంకయ్యకు స్వల్ప గాయాలయ్యాయి. క్షతగాత్రులను 108 లో ప్రొద్దుటూరు ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ తిరుపతమ్మ మృతి చెందినట్లు తెలిపారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్