నీరు, విద్యుత్ ఆదా చేయాలి - డిప్యూటీ రేంజ్ ఆఫీసర్ శ్రీనివాసులు
ప్రజాశక్తి - ముద్దనూరు (కడప) : నీరు,విద్యుత్ వృధా చేయకుండా పొదుపుగా వాడుకోవాలని ముద్దనూరు అటవీశాఖ డిప్యూటి రేంజ్ ఆఫీసర్ శ్రీనివాసులు తెలిపారు.ముద్దనూరు అటవీశాఖ కార్యాలయంలో సోమవారం ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ శ్రీనివాసులు ఆదేశాల మేరకు డిఆర్ఒ ఆధ్వర్యంలో బ్రిక్స్ ఎనర్జీ కన్జర్వేషన్ కార్యక్రమం నిర్వహించారు. ఇందులో భాగంగా నీటి సంరక్షణ,విద్యుత్ ఆదా గురించి బాలుర ఉన్నత పాఠశాల విద్యార్థులకు అవగాహన కల్పించారు.డిఆర్ఒ శ్రీనివాసులు మాట్లాడుతూ నీరు,విద్యుత్ పొదుపుగా వాడితే భావి తరాలకు ఉపయోగకరంగా ఉంటుందన్నారు. వర్షపునీరు ఒడిసి పట్టి సంరక్షించాలన్నారు. పర్యావరణ పరిరక్షణకు మొక్కలు నాటి సంరక్షించాలన్నారు. ఈ కార్యక్రమంలో హెచ్ ఎమ్ ఓబులేష్,ఉపాద్యాయులు పద్మనాభరెడ్డి,అటవీ సిబ్బంది పాల్గొన్నారు.








కామెంట్‌లు (0)