ప్రశ్నిస్తే జీతం నిలిపివేస్తామని బెదిరింపులు
ప్రజాశక్తి - యాదమరి (చిత్తూరు) : యాదమరి మండలం మాదిగవాడ అంగన్వాడీ కేంద్రంలో ఆరు నెలలుగా టీచర్ లేకపోవడంతో సహాయకురాలే చిన్నారుల సంరక్షణతో పాటు అన్ని కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ఈ సమస్యపై పత్రికల్లో కథనం రావడంతో ఐసీడీఎస్ సూపర్‌వైజర్ తనకు ఫోన్ చేసి బెదిరింపులకు పాల్పడ్డారని సహాయకురాలు ఆరోపించారు. సోమవారం ఆమె ప్రజాశక్తితో మాట్లాడుతూ .... మూడు నెలలుగా కేంద్రానికి రాని టీచర్‌కు జీతాలు ఎలా ఇస్తున్నారని ప్రశ్నించినందుకు 'నువ్వు రాజకీయాలు చేస్తున్నావా? నీ జీతం నిలిపివేస్తాం' అంటూ బెదిరించారని తెలిపారు. బంధువుల మరణం సందర్భంగా కూడా సెలవు నిరాకరించడంతో గత్యంతరం లేక కేంద్రానికి తాళం వేసి వెళ్లాల్సి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు. తాము ఎస్సీ సామాజిక వర్గానికి చెందినవారమనే కారణంతో కుల వివక్షకు గురిచేస్తున్నారని ఆరోపించారు. ఉన్నతాధికారులు స్పందించి వేధింపులపై విచారణ జరిపి న్యాయం చేయాలని ఆమె కోరారు.







కామెంట్‌లు (0)