సోమవారం, 16 నవంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

చక్రం నుండి క్వాంటం కంప్యూటింగ్ వరకు...

9 నిమిషాల క్రితం

carres
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 16, 2026, 05:45 పూర్వాహ్నం | 6 నిమిషాల చదవడం

ఆవిష్కరణలు – ఆవిష్కర్తలు (Inventions and Inventors)

మానవ మేధస్సు సృష్టించిన అద్భుతాల ప్రయాణం.

మానవ నాగరికత అభివృద్ధి వెనుక విజ్ఞానశాస్త్రం, సాంకేతిక ఆవిష్కరణలు కీలక పాత్ర పోషించాయి. ప్రాచీన కాలంలో చక్రం వంటి సాధారణ ఆవిష్కరణలతో ప్రారంభమైన మానవ సృజనాత్మకత, ముద్రణా యంత్రం, టెలిస్కోప్, సూక్ష్మదర్శిని వంటి పరికరాల నుంచి విద్యుత్‌, టెలిఫోన్‌, రేడియో, విమానం, కంప్యూటర్‌, ఇంటర్నెట్‌ వరకు అనేక విప్లవాత్మక మార్పులకు దారితీసింది.భౌతికశాస్త్రంలో ఎలక్ట్రాన్‌, X-కిరణాలు, రేడియోధార్మికత, లేజర్‌, ట్రాన్సిస్టర్‌ వంటి ఆవిష్కరణలు ఆధునిక సాంకేతిక ప్రపంచానికి పునాదులు వేశాయి. రసాయనశాస్త్రంలో ఆవర్తన పట్టిక, పరమాణు సిద్ధాంతం వంటి శాస్త్రీయ భావనలు పదార్థాల స్వభావాన్ని అర్థం చేసుకోవడానికి మార్గం చూపాయి. జీవశాస్త్రం, వైద్యరంగాల్లో వ్యాక్సిన్లు, పెన్సిలిన్‌, రక్త గ్రూపులు , ఇన్సులిన్‌, DNA నిర్మాణం వంటి శాస్త్రీయ ఆవిష్కరణలు మానవ ఆరోగ్యం పట్ల, జీవ పరిణామం పట్ల మన అవగాహనను సమూలంగా మార్చాయి.ఇదే ప్రయాణం నేడు కంప్యూటర్‌ సాంకేతికత, మొబైల్‌ కమ్యూనికేషన్‌, ఫైబర్‌ ఆప్టిక్స్‌, GPS, కృత్రిమ మేధస్సు (AI), రోబోటిక్స్‌, అంతరిక్ష సాంకేతికత, బయోటెక్నాలజీ, క్వాంటం కంప్యూటింగ్‌ వంటి అత్యాధునిక రంగాల వరకు విస్తరించింది.ప్రతి ఆవిష్కరణ వెనుక ఒక ప్రశ్న, ఒక ఆలోచన, ప్రయోగం, పరిశోధన, వైఫల్యాలను అధిగమించే పట్టుదల ఉంటాయి. ఎన్నో గొప్ప ఆవిష్కరణలు ఒక వ్యక్తి కృషి ఫలితం మాత్రమే కాదు; శాస్త్రవేత్తలు, పరిశోధకులు, ఇంజినీర్ల సమిష్టి కృషి, అనుభవం, పట్టుదలకు ప్రతిరూపాలు.APPSC Group-I, Group-II తదితర పోటీ పరీక్షల్లో General Science నుంచి ఆవిష్కరణలు, శాస్త్రవేత్తలపై ప్రశ్నలు అడుగుతుంటారు. కాబట్టి ఈ అంశాలపై అవగాహన విద్యార్థులకు ఎంతో ఉపయోగకరం. ఈ నేపథ్యంలో భౌతికశాస్త్రం, రసాయనశాస్త్రం, జీవశాస్త్రం, వైద్యశాస్త్రం, కంప్యూటర్‌ సైన్స్‌, కమ్యూనికేషన్‌, అంతరిక్ష విజ్ఞానం, ఆధునిక సాంకేతిక రంగాలకు చెందిన 100 ముఖ్యమైన ఆవిష్కరణలు–ఆవిష్కర్తలను పరిశీలిద్దాం. ఆలోచనకు ఆవిష్కరణ రూపమైతే, ఆవిష్కరణకు మానవ మేధస్సు, పరిశోధన, పట్టుదలే పునాది.

1. చక్రం (Wheel) – ప్రాచీన మానవ నాగరికత ((క్రీ.పూ. 3500 ప్రాంతంలో మెసొపొటేమియా నాగరికతలో)

2. ముద్రణా యంత్రం - (Printing Press) జోహానెస్ గుటెన్‌బర్గ్

3. దూరదర్శిని (Telescope – astronomical use) గెలీలియో గెలీలీ

4. సూక్ష్మదర్శిని (Microscope) — జకారియాస్ జాన్సెన్ (Zacharias Janssen)

5. లోలక గడియారం (Pendulum Clock) – క్రిస్టియన్ హ్యూజెన్స్

6. ఆవిరి యంత్రం (Steam Engine) - జేమ్స్ వాట్

7. టెలిఫోన్ (Telephone) - అలెగ్జాండర్ గ్రాహం బెల్

8. విద్యుత్ బల్బు (Incandescent Lamp) - థామస్ ఆల్వా ఎడిసన్

9. రేడియో — గుగ్లియెల్మో మార్కోని

10. టెలివిజన్ (Television) - జాన్ లోగీ బెయర్డ్

11. విద్యుత్ మోటార్ – (Electric Motor) మైకేల్ ఫారడే,

12. X-కిరణాలు (X-rays) - రాంట్‌జెన్

13. డైనమో (Dynamo) - మైకేల్ ఫారడే

14. విద్యుదయస్కాంత ప్రేరణ (Electromagnetic Induction) - మైకేల్ ఫారడే

15. బ్యాటరీ (Voltaic Cell) - అలెసాండ్రో వోల్టా

16. ఎలక్ట్రాన్ (Electron) - జె. జె. థామ్సన్

17. ప్రోటాన్ (Proton) - ఎర్నెస్ట్ రూథర్‌ఫోర్డ్

18. న్యూట్రాన్ (Neutron) - జేమ్స్ చాడ్విక్

19 విద్యుత్ జనరేటర్ – (Generator)మైకేల్ ఫారడే

20. రేడియోధార్మికత (Radioactivity) - హెన్రీ బెకెరెల్

21. పరమాణు కేంద్రకం (Atomic Nucleus) - ఎర్నెస్ట్ రూథర్‌ఫోర్డ్

22. బోర్ పరమాణు నమూనా (Bohr Atomic Model) - నీల్స్ బోర్

23. ఫోటోఎలక్ట్రిక్ ఫలితం (Photoelectric Effect) – అల్బర్ట్ ఐన్‌స్టీన్

24. సాపేక్ష సిద్ధాంతం (Theory of Relativity) – అల్బర్ట్ ఐన్‌స్టీన్

25. సైక్లోట్రాన్ (Cyclotron)- E.O. లారెన్స్

26. లేజర్ (Laser) - థియోడర్ మైమన్

27. క్వాంటం సిద్ధాంతం (Quantum Theory) – మ్యాక్స్ ప్లాంక్

28. ట్రాన్సిస్టర్ (Transistor) - జాన్ బార్డీన్, వాల్టర్ బ్రాట్టెయిన్, విలియం షాక్‌లీ

29. రాడార్ (Radar) - రాబర్ట్ వాట్సన్-వాట్

30. టెలిగ్రాఫ్ (Telegraph) - శామ్యూల్ మోర్స్

31. మోర్స్ కోడ్ (Morse Code) - శామ్యూల్ మోర్స్, ఆల్ఫ్రెడ్ వైల్

32. ఫోటోగ్రఫీ – డాగ్యురియోటైప్ (Daguerreotype) – లూయిస్ డాగ్యూర్ (Louis Daguerre)

33. డిజిటల్ కెమెరా (Digital Camera) – స్టీవెన్ సాసన్

34. గ్రామోఫోన్ (Gramophone) - ఎమిల్ బెర్లినర్

35. ఫోనోగ్రాఫ్ (Phonograph) - థామస్ ఎడిసన్

36. టైప్‌రైటర్ (Typewriter) - క్రిస్టోఫర్ లాథమ్ షోల్స్

37. సేఫ్టీ ఎలివేటర్ (Safety Elevator) - ఎలిషా ఓటిస్

38. విమానం (Airplane) – రైట్ సోదరులు (Wright Brothers)

39. హెలికాప్టర్ (Helicopter) – ఇగోర్ సికోర్స్కీ

40. జెట్ ఇంజిన్ (Jet Engine) – ఫ్రాంక్ విటిల్, హాన్స్ వాన్ ఓహైన్ (Frank Whittle, Hans von Ohain)

41. డీజిల్ ఇంజిన్ (Diesel Engine) - రుడాల్ఫ్ డీజిల్

42. ఎయిర్ కండిషనింగ్ (Air Conditioning) – విల్లిస్ క్యారియర్ (Willis Carrier)

43. శీతలీకరణ (Refrigeration) – జేమ్స్ హారిసన్ (James Harrison)

44. పెన్సిలిన్ (Penicillin) - అలెగ్జాండర్ ఫ్లెమింగ్

45. వ్యాక్సినేషన్ – మశూచి (Smallpox Vaccination) - ఎడ్వర్డ్ జెన్నర్

46. రక్త ప్రసరణ (Blood Circulation) - విలియం హార్వే

47. సూక్ష్మజీవుల వ్యాధి సిద్ధాంతం (Germ Theory) - లూయీ పాశ్చర్, రాబర్ట్ కోచ్

48. రేబీస్ వ్యాక్సిన్ (Rabies Vaccine) - లూయీ పాశ్చర్

49. స్టెతస్కోప్ (Stethoscope) - రెనే లెన్నెక్

50. ECG (Electrocardiogram) - విల్లెం ఐంతోవెన్

51. రక్త గ్రూపులు (Blood Groups) - కార్ల్ లాండ్‌స్టైనర్

52 ఇన్సులిన్ (Insulin) - ఫ్రెడరిక్ బాంటింగ్, చార్ల్స్ బెస్ట్ 53. DNA డబుల్ హెలిక్స్ నమూనా (DNA Double Helix Model) – జేమ్స్ వాట్సన్, ఫ్రాన్సిస్ క్రిక్ (James Watson,

Francis Crick)

54. వారసత్వ నియమాలు (Laws of Heredity) – గ్రెగర్ మెండల్ (Gregor Mendel)

55. సహజ ఎంపిక సిద్ధాంతం (Natural Selection) చార్లెస్ డార్విన్, ఆల్ఫ్రెడ్ రస్సెల్ వాలెస్

56. టీకాలు (Vaccines) – లూయీ పాశ్చర్ (Louis Pasteur)

57. క్లోరోఫిల్ పాత్ర / కిరణజన్య సంయోగక్రియ పరిశోధన - జోసెఫ్ ప్రీస్ట్లీ, జాన్ ఇంగెన్‌హౌస్

58. ఆక్సిజన్ (Oxygen) – జోసెఫ్ ప్రీస్ట్లీ, కార్ల్ విల్హెల్మ్ షీలే (Joseph Priestley, Carl Wilhelm Scheele)

59. హైడ్రోజన్ (Hydrogen) - హెన్రీ కావెండిష్

60. ఆవర్తన పట్టిక (Periodic Table) - దిమిత్రి మెండలీవ్

61. పరమాణు సిద్ధాంతం (Atomic Theory) - జాన్ డాల్టన్

62. అణు సంఖ్య (Atomic Number) - హెన్రీ మోస్లీ

63. రేడియం (Radium) - మేరీ క్యూరీ, పియరీ క్యూరీ

64. కృత్రిమ రేడియోధార్మికత (Artificial Radioactivity) ఐరీన్ జోలియో-క్యూరీ, ఫ్రెడరిక్ జోలియో-క్యూరీ

65. అణు విభజన (Nuclear Fission) – ఒట్టో హాన్, ఫ్రిట్జ్ స్ట్రాస్‌మాన్ (Otto Hahn, Fritz Strassmann)

66. ఆవిరి టర్బైన్ (Steam Turbine) చార్ల్స్ పార్సన్స్

67. థర్మామీటర్ – గెలీలియో గెలీలీ

68. సెల్సియస్ ఉష్ణోగ్రత - స్కేలుఆండర్స్ సెల్సియస్

69. ఫారెన్‌హీట్ ఉష్ణోగ్రత - డానియెల్ గాబ్రియేల్ ఫారెన్‌హీట్

70. బారోమీటర్ (Barometer) - ఎవాంజెలిస్టా టోరిచెల్లీ

71. ఫౌంటెన్ పెన్ (Fountain Pen) - లూయిస్ వాటర్‌మన్

72. బాల్‌పాయింట్ పెన్ (Ballpoint Pen) లాస్లో బీరో

73. సేఫ్టీ రేజర్ (Safety Razor) - కింగ్ క్యాంప్ జిలెట్

74. కుట్టు యంత్రం (Sewing Machine) - ఎలియాస్ హోవ్

75. సైకిల్ – జాన్ కెంప్ స్టార్లీ

76. మోటార్ కారు – కార్ల్ బెంజ్

77. స్టీమ్‌బోట్ - రాబర్ట్ ఫుల్టన్

78. ఫ్యాక్స్ యంత్రం (Fax) – అలెగ్జాండర్ బైన్

79. కంప్యూటర్ – చార్ల్స్ బాబేజ్

80. సమగ్ర వలయం (Integrated Circuit) – జాక్ కిల్బీ, రాబర్ట్ నోయిస్

81. ఇంటర్నెట్ – TCP/IP – వింట్ సెర్ఫ్, బాబ్ కాన్

82. వరల్డ్ వైడ్ వెబ్ (WWW) - టిమ్ బెర్నర్స్-లీ

83. ఈ-మెయిల్ (Email) - రే టామ్‌లిన్సన్

84. మొబైల్ ఫోన్ – మార్టిన్ కూపర్

85. బ్లూటూత్ (Bluetooth) – జాప్ హార్ట్‌సెన్ తదితరులు

86. GPS – Global Positioning Systemఅమెరికా రక్షణ శాఖ; అనేక శాస్త్రవేత్తలు/ఇంజినీర్లు

87. LED (Light Emitting Diode) – నిక్ హోలోన్యాక్ జూనియర్

88. LCD – Liquid Crystal Display - జార్జ్ హైల్‌మేయర్

89. ఫైబర్ ఆప్టిక్స్ కమ్యూనికేషన్ – చార్ల్స్ కే. కావో (Charles K. Kao)

90. కృత్రిమ మేధస్సు (Artificial Intelligence) - జాన్ మెకార్తీ

91. రోబోట్ (Robot) – కారెల్ చాపెక్

92. క్వాంటం కంప్యూటింగ్ – పాల్ బెనియాఫ్, యూరి మానిన్, డేవిడ్ డాయిచ్ .

93. రాకెట్ – రాబర్ట్ గాడర్డ్

94. అంతరిక్షంలో మొదటి కృత్రిమ ఉపగ్రహం – Sputnik 1

95. చంద్రునిపై తొలి మానవ అడుగు - నీల్ ఆర్మ్‌స్ట్రాంగ్

96. తొలి కృత్రిమ ఉపగ్రహం – భారతదేశం, Aryabhata

97. భారతదేశ తొలి స్వదేశీ ఉపగ్రహ ప్రయోగ వాహనం – SLV-3

98. భారత అంతరిక్ష కార్యక్రమ పితామహుడు - విక్రమ్ సారాభాయి

99. భారత అణు కార్యక్రమ పితామహుడు - హోమీ జె. భాభా

100. హబుల్ అంతరిక్ష టెలిస్కోప్ (Hubble Space Telescope) – NASA మరియు ESA


డాక్టర్. పల్లె. సూర్యనాగి రెడ్డి

భౌతికశాస్త్ర అధ్యాపకులు

ప్రభుత్వ కళాశాల (అటానమస్),

అనంతపురం. సెల్‌ : 9491155894

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్