సోమవారం, 16 నవంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

భారత్‌‌లో 2031 ప్రపంచకప్‌

5 గంటల క్రితం

cup
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 16, 2026, 12:34 పూర్వాహ్నం | 1 నిమిషాల చదవడం

- ఐసిసి అధికారిక ప్రకటన

న్యూఢిల్లీ : భారత్‌‌లో 2031 వన్డే ప్రపంచకప్‌ ‌జరగనుంది. ఈ మేరకు అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసిసి) భవిష్యత్ క్రికెట్ టోర్నీలకు సంబంధించిన పూర్తి షెడ్యూల్‌ను అధికారికంగా ప్రకటించింది. 2027 నుంచి 2035 వరకు జరగనున్న ప్రధాన పురుషుల ఐసిసి టోర్నీల తేదీలను, విండోలను ఐసిసి ఖరారు చేసింది. ముఖ్యంగా 2027లో వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్, మెన్స్ వన్డే వరల్డ్ కప్ జరగనుండగా.. అప్పటి నుంచి 2035 చివరి నాటికి మొత్తం 12 ఐసిసి మెగా టోర్నీలు నిర్వహించను న్నట్లు స్పష్టం చేసింది. ఇప్పటి వరకు 2031 వరకు జరగాల్సిన టోర్నీల తేదీలు, వేదికలను ఆమోదించిన ఐసిసి.. 2031 తర్వాత జరిగే టోర్నీల వేదికలను మాత్రం త్వరలోనే ప్రకటిస్తామని వెల్లడించింది.

కీలక టోర్నీల వేదికలు

2031 వన్డే ప్రపంచకప్ టోర్నీకి భారత్, బంగ్లాదేశ్ సంయుక్తంగా ఆతిథ్యమివ్వనున్నాయి. అయితే ప్రతిష్టాత్మక వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్స్ (2029, 2031 సంవత్సరాలకు సంబంధించి) యథావిధిగా ఇంగ్లండ్‌లోనే జరగనున్నాయి. 2027 సౌతాఫ్రికా వన్డే ప్రపంచకప్ తర్వాత ప్రారంభమయ్యే ఈ విండోలో భాగంగా 2035 నాటికి నాలుగు టి20 ప్రపంచకప్‌లు, రెండు ఛాంపియన్స్ ట్రోఫీ టోర్నీలతో పాటు పలు ఐసిసి ఈవెంట్లను నిర్వహించేందుకు క్యాలెండర్‌ను సిద్ధం చేసింది. క్రికెట్ అభిమానులకు రాబోయే దశాబ్ద కాలం పాటు అసలైన వినోదం అందనుంది.


2027 నుంచి 2035 వరకు టోర్నీల షెడ్యూల్

2027: వన్డే ప్రపంచకప్ (జింబాబ్వే - నమీబియా)

2028 (జూన్): టి20 ప్రపంచకప్ (ఆస్ట్రేలియా, న్యూజిలాండ్)

2028 (అక్టోబర్): ఛాంపియన్స్ ట్రోఫీ

2029 (జూన్): వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్ (ఇంగ్లండ్)

2029 (అక్టోబర్): టి20 ప్రపంచకప్ (భారత్, శ్రీలంక)

2030 (ఫిబ్రవరి): ఛాంపియన్స్ ట్రోఫీ (పాకిస్తాన్)

2030 (జూన్): టి20 ప్రపంచకప్ (యుకె)

2031 (జూన్): వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్ (ఇంగ్లండ్)

2031 (అక్టోబర్-నవంబర్): వన్డే ప్రపంచకప్ (భారత్, బంగ్లాదేశ్)

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్