సోమవారం, 16 నవంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

కుమమోటో మాస్టర్స్‌లో లక్ష్యసేన్ ఘన విజయం

5 గంటల క్రితం

కుమమోటో మాస్టర్స్‌లో లక్ష్యసేన్ ఘన విజయం
-  తొలి భారతీయుడిగా రికార్డు image 1
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 16, 2026, 12:14 పూర్వాహ్నం | 1 నిమిషాల చదవడం

- తొలి భారతీయుడిగా రికార్డు

టొక్యో : భారత బ్యాడ్మింటన్ స్టార్ లక్ష్యసేన్ చరిత్ర సృష్టించాడు. కుమమోటో మాస్టర్స్ జపాన్ 2026 పురుషుల సింగిల్స్ టైటిల్‌ను గెలుచుకున్న తొలి భారతీయ ఆటగాడిగా నిలిచాడు. ఆదివారం జరిగిన ఫైనల్‌లో తొలి గేమ్ కోల్పోయినా, అద్భుతంగా పుంజుకుని జపాన్‌ ఆటగాడు కోకి వతనాబేను ఓడించాడు. తొలి గేమ్‌ను 13-21తో కోల్పోయిన లక్ష్యసేన్, తర్వాతి రెండు గేమ్‌లలో 21-18, 21-14తో గెలిచి మ్యాచ్‌ను తన ఖాతాలో వేసుకున్నాడు. ఈ పోరు గంటకు పైగా సాగింది. 2023లో ఈ టోర్నీ ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటివరకు టైటిల్ నెగ్గిన తొలి భారత షట్లర్ అతడే. అయితే, శనివారం జరిగిన సెమీఫైనల్‌లో ఇండోనేసియాకు చెందిన ప్రపంచ పదో ర్యాంకర్ అల్వి ఫర్హాన్‌ను మూడు గేమ్‌లలో ఓడించి ఫైనల్‌కు చేరాడు. ఈ గెలుపుతో లక్ష్యసేన్ వరుసగా రెండో బిడబ్ల్యూఎఫ్ సూపర్ 500 టైటిల్ సాధించాడు. ఒక సీజన్‌లో రెండు వరల్డ్ టూర్ టైటిళ్లు గెలవడం అతడికి ఇదే తొలిసారి. 2026లో మొత్తం మూడు టూర్ ఫైనళ్లకు చేరిన లక్ష్య సేన్‌, మార్చిలో ఆల్ ఇంగ్లండ్ ఓపెన్‌లో రన్నరప్‌గా నిలిచాడు. ఆ తర్వాత హైలో ఓపెన్, ఇప్పుడు కుమమోటో మాస్టర్స్ టైటిళ్లు గెలిచాడు.

చరిత్ర సృష్టించిన లక్ష్యసేన్‌‌కు అభినందనలు : ఎంఎ బేబీ

లక్ష్యసేన్ విజయంపై సిపిఎం ప్రధాన కార్యదర్శి ఎంఎ బేబీ సోషల్‌ ‌మీడియా ఎక్స్ వేదికగా అభినందనలు తెలిపారు. ‘‘ఎంతటి అద్భుత విజయం! అద్భుతమైన పునరాగమనంతో లక్ష్యసేన్ చరిత్ర సృష్టించాడు. కుమమోటో మాస్టర్స్ జపాన్ గెలిచిన తొలి భారతీయుడిగా, వరుసగా రెండు బిడబ్ల్యూఎఫ్ సూపర్ 500 టైటిళ్లు సాధించాడు. ఇది భారత్‌కు గర్వకారణం. మరెన్నో విజయాలు సాధించాలి’’ అని ఆయన పేర్కొన్నారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్