సోమవారం, 17 ఆగస్టు 2026E-PAPER
మ్యాగజైన్స్

Hayden Panettiere - హాలీవుడ్ నటి హేడెన్ పనెట్టియర్ కన్నుమూత

1 గంట క్రితం

Hollywood actress Hayden Panettiere passes away.
వెబ్ డెస్క్

ప్రచురించబడింది ఆగ 17, 2026, 11:48 పూర్వాహ్నం | 1 నిమిషాల చదవడం

లాస్ ఏంజెల్స్ : ప్రసిద్ధ హాలీవుడ్ నటి హేడెన్ పనెట్టియర్ (36) అకస్మాత్తుగా మరణించారు. ఆమె మృతి చెందిన విషయాన్ని ప్రతినిధులు ఆదివారం అధికారికంగా ధ్రువీకరించారు. ఆమె మరణవార్త తెలుసుకున్న ప్రపంచవ్యాప్త అభిమానులు, సినీ ప్రముఖులు తీవ్ర శోకసంద్రంలో మునిగిపోయారు. కాగా, ఆమె మృతికి గల నిర్దిష్టమైన కారణాలు, ఇతర పూర్తి వివరాలు ఇంకా తెలియరాలేదు. హేడెన్ పనెట్టియర్ ప్రపంచవ్యాప్తంగా విపరీతమైన ప్రజాదరణ పొందిన ‘హీరోస్’, ‘నాష్‌విల్లే’ వంటి ధారావాహికల్లో (సిరీస్) నటించి విశేష గుర్తింపు తెచ్చుకున్నారు. తన అద్భుతమైన అభినయంతో ఆడియెన్స్ హృదయాల్లో చెరగని ముద్ర వేసిన ఆమె, అతి చిన్నవయసులోనే కన్నుమూయడం ఆమె అభిమానులందరినీ దిగ్భ్రాంతికి గురిచేసింది. హేడెన్ మరణంపై స్పందించిన ఆమె ప్రతినిధి తీవ్ర విచారం వ్యక్తం చేశారు. “ఆమెను వ్యక్తిగతంగా ఎరిగినవారికి, వెండితెరపై చూసి అభిమానించిన కోట్లాదిమందికి హేడెన్ ఎంతో ప్రేమను, సంతోషాన్ని పంచారు. ఆమెను కోల్పోవడం అత్యంత బాధాకరం” అని వెల్లడించారు.




ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్