సోమవారం, 17 ఆగస్టు 2026E-PAPER
మ్యాగజైన్స్

మరణించి.. మరొకరికి చూపునిచ్చి..

1 గంట క్రితం

eye
వెబ్ డెస్క్

ప్రచురించబడింది ఆగ 17, 2026, 12:54 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

ప్రజాశక్తి-పల్నాడు జిల్లా : పల్నాడు జిల్లా మండల కేంద్రమైన రొంపిచర్లకు చెందిన జెట్టిబోయిన కోటిరత్నమ్మ (80) వృద్ధాప్య కారణాలతో మృతి చెందారు. ఆమె కుటుంబ సభ్యుల అంగీకారం, సహకారంతో నేత్రాలను (కార్నియాలను) శంకర కంటి ఆస్పత్రి ఐ బ్యాంక్‌ కు దానం చేసినట్లు భగత్‌సింగ్ భవన్ నిర్వహణ కమిటీ కార్యదర్శి సరికొండ రామకృష్ణ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. మరణించిన వ్యక్తి నేత్రాలను మరణించిన 10 గంటల్లోపు దానం చేయవచ్చని ఆయన అన్నారు. దానం చేసిన కార్నియాలను కంటి ఆస్పత్రి వైద్యులు అవసరమైన వారికి శస్త్రచికిత్స ద్వారా అమర్చి చూపును ప్రసాదించే అవకాశం ఉంటుందని తెలిపారు. మనిషి మరణించిన తర్వాత కూడా కార్నియా కొన్ని గంటల పాటు సజీవంగా ఉంటుందని శంకర కంటి ఆస్పత్రి ఐ బ్యాంక్ ప్రతినిధులు వివరించారు. నేత్రదానం ద్వారా మరణానంతరం కూడా మరొకరికి చూపును అందించే అవకాశం ఉంటుందని, ప్రజలు నేత్రదానంపై అవగాహన పెంచుకోవాలని రామకృష్ణ కోరారు. కార్యక్రమంలో మృతురాలి కుటుంబ సభ్యులు జెట్టిబోయిన అద్దంకి, శివ, సండ్రపాటి చలపతిరావు, శ్రీ వేములయ్య తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్