సోమవారం, 17 ఆగస్టు 2026E-PAPER
మ్యాగజైన్స్

పర్యావరణ పరిరక్షణకు మొక్కలు నాటండి

1 గంట క్రితం

konaseema
వెబ్ డెస్క్

ప్రచురించబడింది ఆగ 17, 2026, 12:49 అపరాహ్నం | 2 నిమిషాల చదవడం

- నేషనల్ గ్రీన్ కార్ప్స్

ప్రజాశక్తి -మామిడికుదురు : ప్రతి ఒక్కరూ మొక్కలు నాటడంతో పర్యావరణాన్ని పరిరక్షించవచ్చని హెష్ ఎమ్ ఆర్ వి రమాదేవి పేర్కొన్నారు. విద్యార్థులను పర్యావరణ పరిరక్షణలో భాగస్వామ్యం చేయటం, పర్యావరణ స్పృహను కలిగించడం, మరియు సుస్థిరాభివృద్ధి కి పునాదులు వేయటం లక్ష్యంగా జాతీయస్థాయిలో పనిచేస్తున్న నేషనల్ గ్రీన్ కార్ప్స్(ఎ పి ఎన్ జి సి - ఏకో క్లబ్ ) కార్యక్రమం పాశర్లపూడి హై స్కూల్లో హెష్ ఎమ్ రమాదేవి అధ్యక్షతన, జీవ శాస్త్ర ఉపాధ్యాయుడు సూరుమేను శ్రీనివాసరావు ఆధ్వర్యంలోసోమవారం కార్యక్రమం జరిగింది. శ్రీనివాసరావు గారి తల్లి సూరుమేను గంగామణి గారిజ్ఞాపకార్థం 5వేలు విలువ చేసే ఎన్ జి సి గ్రీన్ షర్ట్స్, వివిధ రకాల మొక్కలు విద్యార్థులుకుపంపిణి చేశారు. పాఠశాల ఆవరణలో రమాదేవి, మరియు హై స్కూల్ఎస్ ఎమ్ సి చైర్మన్ తోరం నాగరాజు ఈ కార్యక్రమాన్ని మొక్కలు నాటడం ద్వారా చేపట్టారు. ఈ సందర్భంగాహెష్ ఎమ్ మాట్లాడుతూ ఏపీ ఎన్జీసి ఏకో క్లబ్ ద్వారా పాఠశాలలో విద్యార్థులచే మొక్కలు నాటించడం, పెంచడం ద్వారా విద్యార్థులు పర్యావరణ పరిరక్షణలో పాత్ర పోషించాలన్నారు. జీవ శాస్త్ర ఉపాధ్యాయుడు సూరుమేను మాట్లాడుతూ పాఠశాలలోఎన్ జి సి ద్వారా వివిధ రకాల ఏకో క్లబ్స్ ఏర్పాటు చేయడం ద్వారా ముఖ్యంగా మొక్కలు నాటించడం, పర్యావరణ పరిరక్షణ, వివిధ స్వచ్ఛత కార్యక్రమాలు, జల సంరక్షణ, ప్లాస్టిక్ రహిత ప్రచారాలు, నైపుణ్య అభివృద్ధి, సామాజిక స్పృహ కలిగించడం, కాలుష్య నిర్మూలన, జీవ వైవిధ్య పరిరక్షణ, పర్యావరణ హిత ఏకో ఫ్రెండ్లీ కార్యక్రమాలు ద్వారా విద్యార్థులలో శాస్త్రీయ వైఖరి, శాస్త్రీయ దృక్పథం, శాస్త్రి ఆలోచన, పర్యావరణ స్పృహ కలిగించవచ్చన్నారు ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు సిహెచ్ శ్రీధర్, స్టాఫ్ సెక్రటరీ సిహెచ్ రమేష్ బాబు, సిహెచ్ పద్మావతి, కె. కరుణాజీ, కె అర్జున్,కె. మణి కృష్ణ, గీతావాణి, వెంకటేశ్వరరావు, ఫణికుమార్, నైట్ వాచ్మాన్ మల్లి బాబు, విద్యార్థులు , గ్రామ పెద్దలు పాల్గొన్నారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్