సోమవారం, 28 సెప్టెంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

రైలు ప్రయాణంలో తీవ్ర ఇబ్బందిని ఎదుర్కొన్నా : కళాకారిణి శివశ్రీ

2 రోజుల క్రితం

I faced severe difficulties during the train journey: Artist Shivashree
వెబ్ డెస్క్

ప్రచురించబడింది సెప్టెం 26, 2026, 11:43 పూర్వాహ్నం | 1 నిమిషాల చదవడం

బెంగళూరు : రైలు ప్రయాణంలో తాను తీవ్ర ఇబ్బందిని ఎదుర్కొన్నట్లు కళాకారిణి శివశ్రీ స్కందప్రసాద్‌ (బెంగళూరు దక్షిణ లోక్‌సభ సభ్యుడు తేజస్వి సూర్య భార్య) తెలిపారు. ఈ విషయాన్ని ఆమె సామాజిక మాధ్యమం ద్వారా వెల్లడించారు. ఇటీవల తాను ఐదు గంటలపాటు రైలులో ప్రయాణించగా, అందులో దాదాపు నాలుగు గంటలు మానసికంగా ఇబ్బందిపడ్డానని ఆమె పేర్కొన్నారు. సుమారు 56 సీట్లున్న కోచ్‌లో దాదాపు 40 మంది ప్రయాణికులు పెద్దగా మాట్లాడటం, ‘ఉనో’ కార్డులు ఆడటం, యువతులను చూసి పరోక్ష వ్యాఖ్యలు చేయడం వంటి కారణాలతో అసౌకర్యానికి గురయ్యానని తెలిపారు. కళాకారులుగా తమ మనసులో ఎప్పుడూ ఎన్నో ఆలోచనలు ఉంటాయని, చేయబోయే ప్రదర్శనతో పాటు గత ప్రదర్శనల్లో జరిగిన తప్పులను కూడా సమీక్షించుకుంటుంటామని ఆమె వివరించారు. ఇలాంటి పరిస్థితుల్లో కొందరు యువకులు, పెద్దల ప్రవర్తన వల్ల మరింత ఇబ్బంది కలుగుతుందని పేర్కొన్నారు. తనకు మరో బోగీలో కూర్చునే అవకాశం కల్పించాలని కోరినప్పటికీ, అక్కడ సీట్లు అందుబాటులో లేకపోవడంతో అదే బోగీలో ప్రయాణించాల్సి వచ్చిందని శివశ్రీ తెలిపారు.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్