ముంబయి : బాలీవుడ్ సినీనటుడు టైగర్ ష్రాఫ్‌పై జరిగిన కాల్పుల దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. కాల్పుల అనంతరం టైగర్ ష్రాఫ్ ధైర్యంగా వ్యవహరించడంపై ఇప్పుడు సోషల్ మీడియాలో ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. దాడి జరిగిన తర్వాత ఆయన ఏమాత్రం ఆలస్యం చేయకుండా గాయపడిన డ్రైవర్‌ను కాపాడారు. పోలీసుల కోసం ఎదురుచూడకుండా డ్రైవర్‌ను తన సీట్‌లో కూర్చోబెట్టి తానే స్వయంగా కారు నడుపుతూ ఆసుపత్రికి తీసుకెళ్లారు. ఆ సమయంలో టైగర్ చూపించిన ధైర్యంపై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. సినిమాల్లోనే కాదు.. నిజ జీవితంలోనూ హీరో అనిపించుకున్నారని కొనియాడుతూ పోస్ట్‌లు పెడుతున్నారు. మరోవైపు ఆ దాడిలో టైగర్ క్షేమంగా బయటపడ్డారని నటుడి తండ్రి జాకీ ష్రాఫ్ తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుల ఆచూకీ కోసం 12 ప్రత్యేక బృందాలను రంగంలోకి దించి గాలింపు చర్యలు చేపట్టారు. దాడి అనంతరం టైగర్ ష్రాఫ్ ఇంటికి దిశా పటానీ వెళ్లారు. మీడియాతో మాట్లాడేందుకు నిరాకరించిన దిశా.. ఆందోళనగా నటుడి ఇంట్లోకి వెళ్లారు.
హీరో టైగర్ ష్రాఫ్ పై ఆదివారం రాత్రి కొందరు దుండగులు కాల్పులు జరిపిన సంగతి తెలిసిందే. ఆయన కారుపై జరిగిన అయిదు రౌండ్ల కాల్పుల్లో టైగర్ ఫ్రాఫ్ కుడి చేతికి, ఛాతీ భాగంలో గాయాలయ్యాయి. 1990ల్లో మాఫియా కోరల్లో బాలీవుడ్ చిక్కుకున్న ఘటనను తలపించింది. సినీ వర్గాల్లో తీవ్ర కలకలం రేపిందీ ఘటన. దాడికి సంబంధించిన విజువల్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అతిదగ్గర నుంచి కాల్పులు జరిపారు. దీంతో పోలీసులు రంగంలోకి దిగారు. ఈక్రమంలో దాడిలో ముగ్గురు నిందితులు పాల్గొన్నారని సమాచారం మేరకు వారి కోసం గాలించారు. ఈ క్రమంలో ముగ్గురు నిందితులను రాజస్థాన్ లోని కోటాలో పోలీసులు అరెస్ట్ చేశారు. వీరంతా రైల్లో ప్రయాణిస్తూండగా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వీరిలో ఇద్దరు హర్యానాకు, మరొకరు మహారాష్ట్రకు చెందిన షూటర్లుగా గుర్తించారు. వీరికి లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ తో సంబంధం ఉందని పోలీసులు భావిస్తున్నారు. దీంతో విచారణ వేగవంతం చేశారు. మరోవైపు, మహారాష్ట్ర ఉపముఖ్యమంత్రి ఏక్ నాథ్ షిండే ఆదివారం రాత్రి టైగర్ ష్రాఫ్ ఇంటికి వెళ్లి ఆయన్ను పరామర్శించారు. గాయాలతో ఉన్న టైగర్ ష్రాఫ్ ను ఘటనపై ఆరా తీశారు. ఇటువంటి దాడులను ఖండిస్తున్నామన్నారు.







కామెంట్‌లు (0)