సోమవారం, 19 అక్టోబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

బైక్‌ను ఢీకొట్టిన ట్రాక్టర్‌.. వ్యక్తికి తీవ్ర గాయాలు

59 నిమిషాల క్రితం

acident.jpg
వెబ్ డెస్క్

ప్రచురించబడింది అక్టో 19, 2026, 01:43 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

ప్రజాశక్తి - మార్టూరు : జాతీయ రహదారిపై రాంగ్‌రూట్‌లో వచ్చిన ట్రాక్టర్‌ బైక్‌ను ఢీకొట్టడంతో ఓ వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. ఈ ఘటన బొల్లాపల్లి టోల్‌ప్లాజా సమీపంలో సోమవారం చోటుచేసుకుంది. హైవే పోలీసుల కథనం ప్రకారం.. పర్చూరు మండలం నూతలపాడు గ్రామానికి చెందిన పోలూరి నారాయణరెడ్డి బైక్‌పై బొల్లాపల్లి వైపు వెళ్తుండగా, ఎదురుగా రాంగ్‌రూట్‌లో వచ్చిన చిన్నగంజాం మండలం సంతరావూరు గ్రామానికి చెందిన అవినాష్‌ ట్రాక్టర్‌తో ఆయన బైక్‌ను ఢీకొట్టాడు. ఈ ప్రమాదంలో నారాయణరెడ్డి తీవ్రంగా గాయపడ్డాడు. సమాచారం అందుకున్న హైవే పెట్రోలింగ్‌ పోలీసులు అంబులెన్స్‌లో క్షతగాత్రుడిని మార్టూరు ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. ప్రమాదానికి కారణమైన ట్రాక్టర్‌ను వెంబడించి అదుపులోకి తీసుకున్నారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్