సోమవారం, 19 అక్టోబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

ఎన్నికలు శాంతియుతంగా జరగాలి

54 నిమిషాల క్రితం

meeting.jpeg
వెబ్ డెస్క్

ప్రచురించబడింది అక్టో 19, 2026, 01:52 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

  • రాజకీయ పార్టీలు సహకరించాలి

  • ఎన్నికల రిటర్నింగ్ అధికారి శ్రీనివాస్

ప్రజాశక్తి - గణపవరం: రానున్న ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు గణపవరం మండలంలో శాంతియుతంగా జరిగేందుకు రాజకీయ పార్టీలు సహకరించాలని మండల ఎన్నికల రిటర్నింగ్ అధికారి డి. శ్రీనివాస్ కోరారు. మంగళవారం స్థానిక మండల పరిషత్ కార్యాలయంలో నిర్వహించిన రాజకీయ పార్టీల ప్రతినిధుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా శ్రీనివాస్ మాట్లాడుతూ.. మండలంలో ఎన్నికల నిర్వహణకు సంబంధించి 65 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఈ నెల 21 నుంచి 23వ తేదీ వరకు నామినేషన్లు దాఖలు చేయవచ్చని పేర్కొన్నారు. అభ్యర్థులు నామినేషన్లు వేసేందుకు అభ్యర్థితోపాటు మరో ఇద్దరు మాత్రమే కార్యాలయానికి రావాలని సూచించారు. మిగిలిన పార్టీ నాయకులు, కార్యకర్తలు కార్యాలయానికి 100 మీటర్ల దూరంలో ఉండాలని స్పష్టం చేశారు.

సమావేశంలో నిడమర్రు సీఐ నక్కా రజనీకుమార్ మాట్లాడుతూ.. ఎన్నికల సమయంలో మండలంలో ఎలాంటి ఉద్రిక్తతలకు తావులేకుండా ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు జరిగేలా అందరూ సహకరించాలని కోరారు. ఘర్షణలకు పాల్పడితే సంబంధిత వ్యక్తులపై కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. ఈ సమావేశంలో తహసీల్దార్ నూకల రంగలక్ష్మి, గణపవరం ఎస్‌ఐ ఏ. మణికుమార్, సీపీఎం మండల కార్యదర్శి పెచ్చెట్టి నరసింహమూర్తి, తెలుగుదేశం నాయకుడు యాళ్ల సుబ్బారావు, వైసీపీ నాయకులు దండు గోపి, బత్తి అరుణ్‌కుమార్, జనసేన నాయకులు తోట శ్రీనివాస్, కొనిశెట్టి గణేష్, బీజేపీ నాయకులు వంటాకుల అప్పన్న, జల్లి కాకినాడ, మాజీ సర్పంచ్ బాతు నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్