ప్రజాశక్తి-నరసాపురం(పశ్చిమగోదావరి) : ఎన్నికల ప్రక్రియలో భాగంగా అభ్యర్థులు దాఖలు చేసిన నామినేషన్ల పరిశీలన (స్క్రూటినీ) కార్యక్రమం సోమవారం ఉదయం ప్రారంభమైంది. ఎన్నికల రిటర్నింగ్ అధికారి పర్యవేక్షణలో సహాయ రిటర్నింగ్ అధికారులు, సిబ్బంది అభ్యర్థులు సమర్పించిన నామినేషన్ పత్రాలను క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. నామినేషన్లతోపాటు అఫిడవిట్లు, నివాస ధ్రువీకరణ పత్రాలు, కుల ధ్రువీకరణ పత్రాలు, నో డ్యూస్ సర్టిఫికెట్లు, ప్రతిపాదకుల వివరాలను ఎన్నికల నిబంధనల ప్రకారం తనిఖీ చేస్తున్నారు. నామినేషన్ పత్రాల్లో ఏవైనా లోపాలు ఉన్నా, అభ్యంతరాలు వ్యక్తమైనా ఎన్నికల నిబంధనల మేరకు అధికారులు వాటిని పరిశీలిస్తున్నారు. నామినేషన్ల పరిశీలన నేపథ్యంలో మున్సిపల్ కార్యాలయం వద్ద పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. అభ్యర్థులు, వారి ముఖ్య అనుచరులను మాత్రమే కార్యాలయంలోకి అనుమతిస్తున్నారు. నామినేషన్ల పరిశీలన పూర్తయిన అనంతరం అర్హత పొందిన అభ్యర్థుల జాబితాను అధికారులు ప్రకటించనున్నారు.
నరసాపురం మున్సిపల్ కార్యాలయంలో నామినేషన్ల పరిశీలన
55 నిమిషాల క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది అక్టో 19, 2026, 01:47 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం
ట్యాగ్‌లు
సంబంధిత వార్తలు






కామెంట్‌లు (0)