శుక్రవారం, 06 నవంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

ఘనంగా సాయి దుర్గా తేజ్‌ నిశ్చితార్థం ..!

1 గంట క్రితం

Sai Durga Tejs engagement held in a grand manner
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 06, 2026, 09:42 పూర్వాహ్నం | 1 నిమిషాల చదవడం

హైదరాబాద్ : చిరంజీవి మేనల్లుడు, యువ సినీనటుడు సాయి దుర్గా తేజ్‌ త్వరలో పెళ్లి పీటలెక్కబోతున్నారు. ఆయన వివాహం చేసుకోబోయే అమ్మాయి పేరు కిరణ్‌. గురువారం కుటుంబ సభ్యులు, స్నేహితుల సమక్షంలో వీరి నిశ్చితార్థం జరిగింది. ఇందుకు సంబంధించిన ఫొటోను సినీనటుడు రామ్‌చరణ్‌ పంచుకుని శుభాకాంక్షలు చెప్పారు. డిసెంబరు 10 న హైదరాబాద్‌లో సాయి తేజ్‌-కిరణ్‌ల వివాహం జరగనుంది. నిన్న జరిగిన నిశ్చితార్థ వేడుకలో తల్లిదండ్రులు డాక్టర్ శివప్రసాద్, విజయ్‌ దుర్గా, సోదరుడు వైష్ణవ్‌ తేజ్‌, అత్తయ్య-మావయ్య చిరంజీవి, సురేఖలతో పాటు, రామ్‌చరణ్‌, అల్లు అర్జున్‌, అల్లు స్నేహారెడ్డి, అల్లు బాబీ, వరుణ్‌తేజ్‌, లావణ్య త్రిపాఠి, వాయువ్‌ తేజ్‌, నాగబాబు, పద్మజ, నిహారిక కొణిదెల, అల్లు అరవింద్‌, అల్లు నిర్మల, అల్లు శిరీష్‌, నయనిక రెడ్డి, అఖీరా నందన్‌, ఆద్య సహా మెగా కుటుంబం ఈ వేడుకలో పాల్గొంది. సాయితేజ్‌ స్నేహితులు మంచు మనోజ్‌, మౌనికారెడ్డి, నవీన్‌ విజయ్‌ కృష్ణ, హర్ష చెముడు, వెంకీ కుడుముల, హర్షిత్‌రెడ్డి తదితరులు కూడా ఈ వేడుకకు హాజరయ్యారు.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్