* చైర్మన్ అభ్యర్థి హనీ స్పందనకు 3 ఓట్ల ఆధిక్యం
* కౌన్సిలర్ స్థానాల్లో కూటమికి 15 ఓట్ల ఆధిక్యం
ప్రజాశక్తి - చీరాల (బాపట్ల) : చీరాల మున్సిపల్ ఎన్నికల పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపులో కూటమి అభ్యర్థులు ఆధిక్యం సాధించారు. మున్సిపల్ చైర్మన్ స్థానానికి టిడిపి అభ్యర్థి హనీ స్పందనకు 3 ఓట్ల ఆధిక్యం లభించింది. చైర్మన్ స్థానానికి మొత్తం 91 పోస్టల్ బ్యాలెట్ ఓట్లు పోలవగా, టిడిపి కి 40, వైసిపి కి 37, కాంగ్రెస్‌కు 11, బీఎస్పీకి ఒక ఓటు, నోటాకు ఒక ఓటు వచ్చాయి. ఒక ఓటు తిరస్కరణకు గురైంది. అదేవిధంగా 44 వార్డుల్లో పోటీ చేసిన కౌన్సిలర్ అభ్యర్థుల పోస్టల్ బ్యాలెట్ ఓట్లలోనూ కూటమి అభ్యర్థులకు 15 ఓట్ల ఆధిక్యం లభించింది.








కామెంట్‌లు (0)