సోమవారం, 28 సెప్టెంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

ఇంట్లోనే సెలూన్‌, స్పా : స్టార్ హీరోకు బీఎంసీ నోటీసులు

3 రోజుల క్రితం

Salon and spa at home: BMC issues notices to star hero.
వెబ్ డెస్క్

ప్రచురించబడింది సెప్టెం 25, 2026, 11:12 పూర్వాహ్నం | 1 నిమిషాల చదవడం

ముంబయి : బాలీవుడ్ హీరో అజయ్ దేవ్‌గణ్‌ కు బృహన్‌ ముంబయి మున్సిపల్‌ కార్పొరేషన్‌ (BMC)అధికారులు నోటీసులు జారీ చేశారు. ముంబయిలోని జుహులో ఉన్న అజయ్ దేవ్‌గణ్‌ బంగ్లాలో జరుగుతున్న నిర్మాణ పనులను వెంటనే నిలిపివేయాలని ఆదేశిస్తూ ఈ నోటీసులు ఇచ్చారు. అజయ్ దేవ్‌గణ్ తన నివాసంలో సెలూన్‌, స్పా ఏర్పాటు చేసుకునేందుకు నిర్మాణ పనులు చేపడుతున్నారని, అయితే ఇందుకోసం ఎలాంటి ముందస్తు అనుమతులు తీసుకోలేదని బీఎంసీ అధికారులు తెలిపారు. తమకు అందిన హౌసింగ్‌ సొసైటీ ఫిర్యాదు మేరకే ఈ చర్యలు తీసుకున్నట్లు బీఎంసీ వెల్లడించింది. జుహు బంగ్లా ప్రాంగణాన్ని వాణిజ్య ప్రయోజనాల కోసం ఉపయోగించేందుకు ఎలాంటి అనుమతులు జారీ చేయలేదని అధికారులు స్పష్టం చేశారు. బీఎంసీ అధికారులు మాట్లాడుతూ ... ఆ ప్రాంగణంలో ఎలాంటి వాణిజ్య కార్యకలాపాలకు అనుమతులు లేవని స్పష్టం చేశారు. ఫిర్యాదులు అందిన అనంతరం అజయ్ దేవ్‌గణ్‌ను ఈ వ్యవహారంపై వివరణ ఇవ్వాల్సిందిగా కోరామన్నారు. అయితే అజయ్ దేవ్‌గణ్‌ నుంచి ఎలాంటి స్పందన రాకపోవడంతోనే నిర్మాణ పనులను నిలిపివేయాలని నోటీసులు జారీ చేసినట్లు బీఎంసీ అధికారులు వెల్లడించారు.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్