ఆదివారం, 18 అక్టోబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

'స్పిరిట్` మూవీ వాయిదా - కొత్త రిలీజ్ డేట్ ఎప్పుడంటే ...

1 గంట క్రితం

'Spirit' movie postponed – when is the new release date?
వెబ్ డెస్క్

ప్రచురించబడింది అక్టో 18, 2026, 01:09 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

హైదరాబాద్ : పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న చిత్రం ‘స్పిరిట్’. తాజాగా ఈ సినిమాకు సంబంధించి ఓ భారీ అప్‌డేట్ బయటకు వచ్చింది. దీని విడుదల తేదీని సందీప్ రెడ్డి వంగా అధికారికంగా ప్రకటించారు. గతంలో ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది (2027) మార్చి 5న విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే, తాజాగా ఈ సినిమాను వాయిదా వేస్తూ సరికొత్త పోస్టర్‌ను విడుదల చేశారు. 2027 అక్టోబర్ 29న దీపావళి పండుగ కానుకగా ఈ చిత్రాన్ని ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నట్లు అందులో స్పష్టం చేశారు. సోషల్ మీడియా వేదికగా దర్శకుడు సందీప్ ఈ విశేషాన్ని పంచుకున్నారు. ఈ మేరకు విడుదల చేసిన పోస్టర్ నెట్టింట వైరల్‌గా మారింది. ఈ మూవీలో ప్రభాస్‌ పోలీస్‌ ఆఫీసర్‌గా నటించనున్నారు. త్రిప్తి దిమ్రీ కథానాయిక. బాలీవుడ్‌ నటుడు వివేక్‌ ఒబెరాయ్, సీనియర్‌ నటి కాంచన తదితరులు నటిస్తున్నారు. ప్రపంచ వ్యాప్తంగా తొమ్మిది భాషల్లో ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నారు. గుల్షన్ కుమార్ సమర్పణలో టీ-సిరీస్, భద్రకాళి పిక్చర్స్ బ్యానర్లపై ఈ మూవీని నిర్మిస్తున్నారు. భూషణ్ కుమార్, ప్రణయ్ రెడ్డి వంగా, కృషన్ కుమార్, ప్రభాకర్ రెడ్డి వంగా నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు.




ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్