ఆదివారం, 18 అక్టోబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

హామీలు అమలు చేయకపోతే ఎన్నికలను బహిష్కరిస్తాం!

1 గంట క్రితం

dharna.jpg
వెబ్ డెస్క్

ప్రచురించబడింది అక్టో 18, 2026, 01:15 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

  • ముఠాల గ్రామస్తుల ముక్తకంఠం

ప్రజాశక్తి – వెదురుకుప్పం (చిత్తూరు జిల్లా): ఎన్నికల సమయంలో ఇచ్చిన తారు రోడ్డు హామీని రెండున్నరేళ్లు గడుస్తున్నా అమలు చేయకపోవడంతో ముఠాల గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ గ్రామానికి రోడ్డు సౌకర్యం కల్పించకపోతే జరగబోయే ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలను బహిష్కరిస్తామని ముక్తకంఠంతో ప్రకటించారు. చిత్తూరు జిల్లా గంగాధర నెల్లూరు నియోజకవర్గం పరిధిలోని వెదురుకుప్పం మండలం గంఘూవారిపల్లె పంచాయతీకి చెందిన ముఠాల గ్రామంలో ఆదివారం నిర్వహించిన నిరసన కార్యక్రమంలో గ్రామస్తులు ఈ మేరకు తమ నిర్ణయాన్ని వెల్లడించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో కూటమి ప్రభుత్వం తమ గ్రామానికి తారు రోడ్డు నిర్మించి, రవాణా సౌకర్యం కల్పిస్తామని హామీ ఇచ్చిందని తెలిపారు. అయితే రెండున్నరేళ్లు గడుస్తున్నా ఇప్పటివరకు ఆ హామీ అమలుకు నోచుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన మాటను నాయకులు మరిచిపోయారని, తమ గ్రామం వైపు కన్నెత్తి చూడటం లేదని విమర్శించారు. ముఠాల గ్రామంలో సుమారు 40 కుటుంబాలు నివసిస్తున్నాయని, మొత్తం 128 ఓట్లు ఉన్నాయని గ్రామస్తులు తెలిపారు. తమ సమస్యను పరిష్కరించకుండా నిర్లక్ష్యం చేస్తే రాబోయే ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలను బహిష్కరిస్తామని స్పష్టం చేశారు. తమ గ్రామానికి తారు రోడ్డు నిర్మించే వరకు వెనక్కి తగ్గేది లేదని పేర్కొన్నారు.

గ్రామస్తుల ఎన్నికల బహిష్కరణ ప్రకటన ప్రస్తుతం సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్