ఆదివారం, 18 అక్టోబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

మణిపూర్‌లో మరోసారి చెలరేగిన హింస

1 గంట క్రితం

Manipur
వెబ్ డెస్క్

ప్రచురించబడింది అక్టో 18, 2026, 01:18 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

ఇంఫాల్‌ : మణిపూర్‌లో మరోసారి హింసాకాండ చెలరేగింది. కామ్‌జోంగ్‌ జిల్లాలో ఒక గ్రామంలోని కుకీ వర్గానికి చెందిన 15 నివాసాలకు నిప్పుపెట్టారు. దీంతో పెద్ద సంఖ్యలు గ్రామస్తులు అటవీ ప్రాంతాలు, సమీపంలోని ఆర్మీ క్యాంపులో తల దాచుకున్నారని అధికారులు ఆదివారం తెలిపారు. శనివారం అర్థరాత్రి సమయంలో అనుమానిత ఉగ్రవాదులు చస్సాద్‌ గ్రామంపై దాడి చేసి, నివాసాలకు నిప్పుపెట్టారని అన్నారు. అదే రోజు గ్రామంపై ఉగ్రవాదులు కాల్పులు జరిపారని, ఈ కాల్పుల్లో ఒక కుకీ పౌరుడు మరణించగా, మరోనలుగురికి బుల్లెట్‌ గాయాలయ్యాయని అన్నారు.

పరిస్థితిని అదుపులోకి తీసుకురావడానికి అస్సాం రైఫిల్స్‌, సరిహద్దు భద్రతా దళం, కామ్‌జోంగ్‌ పోలీసుల సంయుక్త బృందాన్ని మోహరించినట్లు పోలీసులు ఒక ప్రకటనలో తెలిపారు. చస్సాద్‌లో చెలరేగిన హింసాకాండను ఉపముఖ్యమంత్రి నెమ్చా కిప్గెన్‌ ఖండించారు. నివాసాలను తగులబెట్టడం సహించరాని నేరమని అన్నారు. కుకీ పౌరుని మృతికి సంతాపం ప్రకటించారు. గాయడిన, నిరాశ్రయులైన కుటుంబాలకు సానుభూతి ప్రకటించారు. భద్రతా దళాలు, పోలీసులు, జిల్లాయంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. మరో ఘటనలో శనివారం రాత్రి కామ్‌జోంగ్‌ జిల్లా ప్రధాన కార్యాలయం సమీపంలో, వేరే వర్గానికి చెందిన సాయుధ బృందాలు దాడి చేయడంతో ముగ్గురు తంగ్‌ఖుల్‌ నాగా పౌరులకి గాయాలైన సంగతి తెలిసిందే.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్