హైదరాబాద్ : అర్థవంతమైన మాటలు, ఒకరికొకరు సమయం కేటాయించుకోవడం తగ్గిపోవడం వల్లే బంధాల్లో దూరాలు పెరుగుతున్నాయని సినీ నటి కాజల్ అగర్వాల్ అన్నారు. మారుతున్న అనుబంధాలు, పెరుగుతోన్న విడాకుల కేసుల పై కాజల్ అగర్వాల్ స్పందిస్తూ .... మనుషుల మధ్య అనుబంధాలపై సోషల్ మీడియా ప్రభావం చూపుతోందని ఆమె అభిప్రాయపడ్డారు. ఫోన్‌ల కారణంగా దంపతుల మధ్య ప్రత్యక్ష సంభాషణలు తగ్గిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. రెస్టారెంట్లు, డిన్నర్ డేట్‌లకు వెళ్లినప్పుడు కూడా చాలా మంది ... ఒకరితో ఒకరు మాట్లాడుకోకుండా ఫోన్లకే పరిమితమవుతున్నారన్నారు. అర్థవంతమైన మాటలు, ఒకరికొకరు సమయం కేటాయించుకోవడం తగ్గిపోవడం వల్లే బంధాల్లో దూరాలు పెరుగుతున్నాయని అన్నారు. ‘‘ నేను, నా భర్త ఖాళీ సమయాన్ని చాలా గౌరవిస్తాం. ప్రతివారం క్రమం తప్పకుండా డిన్నర్‌కు వెళ్తాం. ఫోన్లను పక్కనపెట్టి ప్రశాంతంగా మాట్లాడుకుంటాం ” అని కాజల్ చెప్పారు. సోషల్ మీడియా వ్యామోహం నుంచి బయటపడి భాగస్వామితో.. సమయాన్ని గడపడం అలవాటు చేసుకోవాలని ఆమె సూచించారు.
బంధాల్లో దూరాలు పెరగడానికి కారణమిదే : కాజల్ అగర్వాల్
1 గంట క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది సెప్టెం 21, 2026, 12:29 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం
ట్యాగ్‌లు
సంబంధిత వార్తలు






కామెంట్‌లు (0)