ఇంటర్నెట్ : అప్పటివరకు చెట్లు, ఇండ్లపై గంతులేస్తూ ... బాగా అలిసిపోయాననుకున్న ఓ కోతి ... బార్బర్ తో మసాజ్ చేయించుకుంది..! ఆ బార్బర్ కూడా ఎంచక్కా కోతికి మసాజ్ చేశాడు. ఓ బార్బర్ షాపులోకి కోతి దూరింది.. అక్కడ ఉన్న కుర్చీపైకి ఎక్కి దర్జాగా పడుకుంది.. గమనించిన బార్బర్ షాపు యజమాని కోతిని అదిలించడానికి బదులు .. ఆ కోతికి మసాజ్ చేశాడు. ఈ స్పా ట్రీట్‌మెంట్‌కు అది మురిసిపోయింది. కుర్చీపై రిలాక్సింగ్ మోడ్‌లో కళ్లు మూసుకొని, మసాజ్‌ను ఎంజాయ్ చేసింది. ఈ వీడియోను నాగాలాండ్ మంత్రి టెంజెన్ ఇమ్నా అలోంగ్ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ‘మంకేశ్ భాయ్ మసాజ్ టైమ్‌ను ఎంజాయ్ చేస్తున్నాడు. దయచేసి డిస్టర్బ్ చేయొద్దు’ అని పేర్కొన్నారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ‘మంకేశ్ మసాజ్ చేయించుకుంటున్నాడు. సరే మరి డబ్బులు ఎవరు కడతారు..?’ అంటూ ఓ నెటిజన్ సరదాగా వ్యాఖ్యానించారు.
Viral Video - 'డోన్ట్ డిస్టర్బ్ .. దిస్ఈజ్ మసాజ్ టైం ..!`
59 నిమిషాల క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది సెప్టెం 21, 2026, 01:06 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం
ట్యాగ్‌లు
సంబంధిత వార్తలు






కామెంట్‌లు (0)