సోమవారం, 21 సెప్టెంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

ఇడుక్కి, మలప్పురం జిల్లాలపై విరుచుకుపడిన కొండచరియలు

41 నిమిషాల క్రితం

Keralam
వెబ్ డెస్క్

ప్రచురించబడింది సెప్టెం 21, 2026, 01:03 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

తిరువనంతపురం : భారీ వర్షాలతో కేరళలోని పలు జిల్లాల్లో కొండచరియలు విరిగిపడటంతో పాటు మెరుపు వరదలు ముంచెత్తాయి. ఇడుక్కి, మలప్పురం జిల్లాలు అత్యంత తీవ్రంగా ప్రభావితమయ్యాయి. ఆదివారం మున్నార్‌-వట్టవాడ ప్రాంతంలో కొండచరియలు విరిగిపడిన సంగతి తెలిసిందే. అనంతరం అడిమాలిలోని పళంపల్లిచల్‌లోనూ కొండ చరియలు విరిగిపడ్డాయి. శిథిలాలు, వరదనీరు ఆ ప్రాంతాన్ని తాకడానికి కొన్ని నిమిషాల ముందు ఐదు కుటుంబాలు మరో ప్రాంతానికి వెళ్లాయి. దీంతో ప్రమాదం తృటిలో తప్పింది. ఈ ఘటనలో ఒక ఇల్లు పూర్తిగా ధ్వంసమైంది. గత రోజు వర్షం కారణంగా సంభవించిన ఘటనల్లో జిల్లాలో ఇద్దరు వ్యక్తులు మరణించగా, ఒకరు గాయపడ్డారని ఇడుక్కి జిల్లా అధికారి జాకబ్ తెలిపారు.

మలప్పురం జిల్లాలోని చోక్కాడ్ - నిలంబూర్ ప్రాంతంలో ఉన్న కొట్టప్పుజా నదిలో ఆదివారం సాయంత్రం సంభవించిన ఆకస్మిక వరదలో పలువురు కొట్టుకుపోయారు. ఎన్‌డిఆర్‌ఎఫ్‌, ఇతర సంస్థలు గాలింపు, సహాయక చర్యలను చేపట్టాయి. నివేదికల ప్రకారం, ఈ ఘటనలో మరణించిన వారి సంఖ్య సోమవారం నాటికి ఐదుకు చేరగా, గల్లంతైన మరో వ్యక్తి కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. కొండ ప్రాంతాల్లో కురిసిన భారీ వర్షాల కారణంగా కొట్టప్పుజ నది పొంగిపొర్లి ఆకస్మిక వరదలు సంభవించాయని నిలంబూర్ కాంగ్రెస్ ఎమ్మెల్యే తెలిపారు. ఈ ఘటనలో ఆరుగురు ప్రాణాలు కోల్పోయారని అన్నారు. ఆదివారం, నేటితో కలిపి ఐదు మృతదేహాలను వెలికితీశామని అన్నారు. ప్రస్తుతం ఒక మహిళ కోసం గాలింపు చేపడుతున్నామని అన్నారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్