-డిప్యూటీ ఎమ్. పి. డి. ఓ. సయ్యద్ రియాజుద్దీన్
ప్రజాశక్తి కలికిరి : నులిపురుగుల నిర్ములనా దినోత్సవాన్ని విజయవంతం చేద్దామని డిప్యూటీ ఎమ్. పి. డి. ఓ సయ్యద్ రియాజుద్దీన్ పిలుపునిచ్చారు. ఈనెల 25 వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా జాతీయ నులి పురుగుల నిర్మూలన దినము నిర్వహించడం జరుగుతుందని తెలిపారు.1సంవత్సరము నుండి 19సంవత్సరాల వయసు లోపు ఉన్న పిల్లలందరికి నులిపురుగులు మాత్రలు పంపిణీ చేయడం జరుగుతుందని 25 వ తేదీ పాఠశాల కు గైర్హాజరైన పిల్లలకు అక్టోబర్ 5 వ తేదీన పంపిణీ చేయడం జరుగుతుంది అన్నారు. పిల్లలలో రక్తహీనతను తగ్గించడానికి ప్రతీ సంవత్సరము రెండు సార్లు ఆగష్టు మరియు ఫిబ్రవరి నెలలలో అన్ని ప్రభుత్వ మరియు ప్రయివేటు పాఠశాల విద్యార్థులు కు ఉచితంగా పంపిణీ చేయడం జరుగుతుంద అన్నారు. వాయల్పాడు మండల వ్యాప్తంగా10880మంది పిల్లలకు మొత్తం ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాల కు కలిపి అందరికి ఆల్ బెండజోలు 400మీ. గ్రా మాత్రలు పంపిణీ చేస్తామని వారి వివరాలు యాప్ లో ఆన్లైన్ చేయడం జరుగుతుంది అన్నారు. అనంతరం గోడపత్రికలు ఆవిష్కరణ చేశారు. మందులు ఏ. ఎన్. ఎమ్,ఆశాకార్యకర్తలకు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమం లో వైద్యులు డిప్యూటీ ఎమ్. పి. డి. ఓ.సయ్యద్ రియాజ్, పరిపాలన అధికారి సాయి శేఖర్, డాక్టర్ కావ్య గంధ, ఎమ్. ఈ. ఓ. 2.నాగార్జున, డిప్యూటీ హెల్త్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ మహమ్మద్ రఫీ, ఆరోగ్య పర్యవేక్షకులు సుధాకర్, గిరిజమ్మ, ఏ. ఎన్. ఎమ్ ఉషా, అంగన్వాడీ టీచర్ అమ్మాజీ, ఆశ కార్యకర్త నాగవేణి పాల్గొన్నారు.







కామెంట్‌లు (0)