బుధవారం, 12 ఆగస్టు 2026E-PAPER
మ్యాగజైన్స్

Print Editionనాతో పనిచేసిన వాళ్లంతా మంత్రులయ్యారు : బాబీ డియోల్

23 జులై, 2026

Bobby Deol
వెబ్ డెస్క్

ప్రచురించబడింది జులై 23, 2026, 09:18 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

'జన నాయకన్' సినిమా విడుదల సందర్భంగా నటుడు బాబీ డియోల్ సరదా వ్యాఖ్యలు చేశారు. ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ, "విజయ్‌కు అతిగా ప్రచారం చేసుకోవడం ఇష్టం ఉండదు. నాదీ అదే స్వభావం. నాతో కలిసి పనిచేసిన వాళ్లంతా మంత్రులయ్యారు" అని అన్నారు. "'డాకు మహారాజ్'లో బాలకృష్ణతో కలిసి నటించాను. ఆయన చాలా కాలంగా రాజకీయాల్లో ఉన్నారు. గత ఎన్నికల్లో విజయం సాధించారు. 'హరిహర వీరమల్లు'లో పవన్ కల్యాణ్‌తో కలిసి నటించాను. ఆయన మంత్రి, ఉప ముఖ్యమంత్రి అయ్యారు. ఇప్పుడు 'జన నాయకన్'లో విజయ్‌తో కలిసి నటించాను. ఆయన ఏకంగా ముఖ్యమంత్రి అయ్యారు" అంటూ చమత్కరించారు. సూర్యతో కలిసి నటించిన 'కంగువా' ఆశించిన విజయాన్ని సాధించకపోయినా, ఆయనతో కలిసి పనిచేయడం మంచి అనుభవంగా మిగిలిందని బాబీ డియోల్ చెప్పారు.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్