ఆదివారం, 18 అక్టోబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

ఆర్‌‌టిసి బస్సు అదుపుతప్పి బోల్తా

22 సెప్టెంబర్, 2026

RTC bus overturns – 20 injured
వెబ్ డెస్క్

ప్రచురించబడింది సెప్టెం 22, 2026, 09:30 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

  • 20 మందికి గాయాలు

ప్రజాశక్తి-వాల్మీకిపురం (అన్నమయ్య జిల్లా) : ప్రమాదవశాత్తు టైరు పంక్చర్ అయ్యి బస్సు అదుపుతప్పి బోల్తా పడింది. ఈ సంఘటన అన్నమయ్య జిల్లా వాల్మీకిపురం మండలం విఠలం సమీపంలోని మదనపల్లి-తిరుపతి జాతీయ రహదారిపై మంగళవారం చోటు చేసుకుంది. పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు తెలిపిన వివరాల మేరకు.. మదనపల్లి నుంచి తిరుపతికి వెళ్తున్న ఆర్‌‌టిసి బస్సు ఉదయం 11 గంటల ప్రాంతంలో వాల్మీకిపురం మండలం విఠలం వద్ద ప్రమాదవశాత్తు ముందు టైరు పంక్చర్ కావడంతో పక్కనే ఉన్న చిన్న కల్వర్టును ఢీకొని బోల్తా పడింది. ఈ ప్రమాదంలో డ్రైవర్ వెంకటేశ్వరరావుతో సహా 20 మందికి తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు వారిని స్థానిక ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అక్కడ ప్రథమ చికిత్స అనంతరం 108లో మదనపల్లికి రెఫర్ చేశారు. ఇక్కడ తూతూ మంత్రంగా చికిత్స అందించి, స్థానిక వైద్యులు మమ అనిపించుకున్నారని, ఎదరొమ్ము నొప్పిగా ఉందని ఆరేళ్ల బాలుడు, అతని తల్లి మొరపెట్టుకున్నా ఎక్స్‌రే తీయకుండా మదనపల్లికి వెళ్లి తీయించుకోండి అంటూ ఉచిత సలహాలు ఇచ్చారని వైద్యులపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్