ప్రజాశక్తి-మంగళగిరి (గుంటూరు) : విద్యుత్ రంగంలో ప్రైవేటీకరణ విధానాలను నిలిపివేయాలని యునైటెడ్ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయిస్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు ముజఫర్ అహ్మద్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బి సుమన్, సి పి డి సి ఎల్ రాష్ట్ర అధ్యక్షులు పులి అనిల్ కుమార్ అన్నారు. కాంట్రాక్ట్ కార్మికులను సంస్థలు విలీనం చేయాలని, పాత పెన్షన్, హయ్యర్ పెన్షన్ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ యునైటెడ్ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయిస్ యూనియన్ ఆధ్వర్యంలో విజయవాడ నుండి బయలుదేరిన బైక్ ర్యాలీ మంగళవారం మంగళగిరికి చేరుకుంది. ఈ సందర్భంగా మంగళగిరి ఏడీ కార్యాలయం వద్ద జరిగిన కార్యక్రమంలో మాట్లాడారు. కార్యాలయంలో ఉన్న సిబ్బంది అందరికీ కరపత్రాలను పంపిణీ చేశారు. ఈనెల 28వ తేదీ తిరుపతిలో జరిగే విద్యుత్ ఉద్యోగుల, కాంట్రాక్ట్ కార్మికుల చైతన్య యాత్రలో పాల్గొని జయప్రదం చేయాలని వారు కోరారు. గత ప్రభుత్వం విద్యుత్ రంగాన్ని తాకట్టు పెట్టి లక్షల కోట్ల అప్పుల భారం వేశారని విమర్శించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాకముందు గత ప్రభుత్వం పై ఆరోపణలు చేసి అధికారంలోకి వచ్చిన తర్వాత విద్యుత్ సంస్థకు నష్టం వచ్చే ఆ ఒప్పందాలనే కొనసాగిస్తూ, నష్టాలకు కార్మికులు, ఉద్యోగులే కారణం అంటూ ప్రచారం చేయడం సబబు కాదని అన్నారు. విద్యుత్ సంస్థను కాపాడుకోవడం కోసం సంఘటితంగా ఉద్యోగులు, కాంట్రాక్ట్ కార్మికులు ఉద్యమించాలని పిలుపునిచ్చారు. కాంట్రాక్ట్, అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు, ఉద్యోగ కార్మికులకు 2018 నుండి నిలిపి వేసిన డీఏ ను పునరుద్ధరించాలని కోరారు. విద్యుత్తు రంగంలో పి.ఆర్.సి కమిటీని ప్రకటించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం చర్చలకు అన్ని యూనియన్ల నాయకులను ఆహ్వానించాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో యునైటెడ్ ఎలక్ట్రిసిటీ వర్కర్స్ యూనియన్ జిల్లా కార్యదర్శి జి నాగరాజు, సి పి డి సి ఎల్ కార్యదర్శి దాసరి వెంకటేశ్వరరావు, సిఐటియు జిల్లా అధ్యక్షులు బి లక్ష్మణరావు, సిఐటియు మంగళగిరి పట్టణ కన్వీనర్ ఎం బాలాజీ, జిల్లా నాయకులు జి పవన్, భాస్కర్, వర్మ, ఎం రవి, బి రవి, వేణు, హేమంత్, రాంబాబు, భాష తదితరులు పాల్గొన్నారు.
విద్యుత్తు రంగంలో ప్రైవేటీకరణ విధానాలు నిలిపివేయాలి : సిఐటియు
1 గంట క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది సెప్టెం 22, 2026, 01:17 అపరాహ్నం | 2 నిమిషాల చదవడం
ట్యాగ్‌లు
సంబంధిత వార్తలు






కామెంట్‌లు (0)