mh ad
శనివారం, 20 జూన్ 2026E-PAPER
మ్యాగజైన్స్

యుద్ధ విమానాలతో ఇజ్రాయిల్‌ లెబనాన్‌‌పై దాడులు : ఐదుగురు మృతి

5 గంటల క్రితం

Israeli strikes on Lebanon
వెబ్ డెస్క్

ప్రచురించబడింది జూన్ 20, 2026, 12:42 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

జెరూసలెం : ఇజ్రాయిల్‌ ‌లెబనాన్‌‌పై మళ్లీ విరుచుకుపడింది. ఇజ్రాయిల్, హిజ్బుల్లా మధ్య కాల్పుల విరమణను పునరుద్ధరించినట్లు ప్రకటించిన మరుసటి రోజే దక్షిణ లెబనాన్‌పై ఇజ్రాయిల్‌ ‌దాడులు జరిపింది. ఈ దాడుల్లో ఐదుగురు మృతి చెందారని లెబనాన్‌ ‌ప్రభుత్వ ఆధ్వర్యంలోని నేషనల్‌ న్యూస్‌ ఏజెన్సీ (ఎన్‌ఎన్‌ఎ) వెల్లడించింది. శుక్రవారం అర్ధర్రాతి నుండి శనివారం తెల్లవారుజామున వరకు ఇజ్రాయిల్‌ యుద్ధవిమానాలతో, డ్రోన్‌‌లతో దాడులకు పాల్పడింది. ముఖ్యంగా నబాటియే దాని పరిసర ప్రాంతాలను లక్ష్యంగా చేసుకుని ఇజ్రాయిల్‌ ‌దాడులకి పాల్పడిందని ఎన్‌ఎన్‌ఎ వెల్లడించింది. ఈ దాడుల వల్ల నివాస భవనాలు, ఇళ్లు ధ్వంసమయ్యాయని మీడియా వెల్లడించింది.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్