mh ad
శనివారం, 20 జూన్ 2026E-PAPER
మ్యాగజైన్స్

స్వచ్ఛ సమాజం మనందరి బాధ్యత : ఎంపీడీవో రాజు

3 గంటల క్రితం

A clean society is the responsibility of us all: MPDO Raju
వెబ్ డెస్క్

ప్రచురించబడింది జూన్ 20, 2026, 04:19 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

ఆలమూరు (కోనసీమ) : పల్లెలు పరిశుభ్రతను సాధించాలంటే స్వచ్ఛమైన సమాజానికి మనందరం కట్టుబడి బాధ్యతగా పనిచేద్దామని మండల పరిషత్ అభివృద్ధి అధికారి ఎంపీడీవో ఏ.రాజు, తహసీల్దార్ కె.కుశరాజు పిలుపునిచ్చారు. మండల కేంద్రం లో "స్వచ్ఛ భారత్ - స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్" కార్యక్రమంలో శనివారం వారి ఆధ్వర్యంలో అన్ని శాఖల అధికారులతో ఘనంగా నిర్వహించారు. ముందుగా ర్యాలీ చేసి, అనంతరం వారంతా ప్రతిజ్ఞ చేశారు. ఈ సందర్భంగా ఎంపీడీవో మాట్లాడుతూ, పర్యావరణాన్ని కాపాడుకోవడం కేవలం ప్రభుత్వ బాధ్యత మాత్రమే కాదని, ప్రతి పౌరుడి ప్రాథమిక కర్తవ్యమని పేర్కొన్నారు. పెరుగుతున్న కాలుష్యాన్ని అరికట్టడానికి, పరిసరాల పరిశుభ్రత అత్యంత కీలకమని ఆయన నొక్కి చెప్పారు. ముఖ్యంగా సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వాడకం వల్ల కలిగే అనర్థాలను వివరిస్తూ, నిషేధిత ప్లాస్టిక్ వస్తువులను ఎట్టి పరిస్థితుల్లోనూ వాడకూడదని హెచ్చరించారు. తడి చెత్తను సేంద్రియ ఎరువుగా, పొడి చెత్తను రీసైక్లింగ్ కేంద్రాలకు పంపి ఆదాయం పొందే దిశగా ప్రజలకు అవగాహన కల్పించాలని ఆయన సూచించారు. ప్రతి ఒక్కరూ బాధ్యతగా తమ ఇంటి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకుంటేనే రాష్ట్రం మొత్తం స్వచ్ఛాంధ్రగా మారుతుందని ఎంపీడీఓ రాజు స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో మండల పరిషత్ ఏవో మెహర్ ప్రకాష్, వ్యవసాయ శాఖ ఏవో బి.మీనా, డీటీ మంగారావు, డిప్యూటీ ఎంపీడీవో ఎస్ వీర్రాజు, సబ్ రిజిస్టర్ స్వర్ణ కుమారి, సీనియర్ అసిస్టెంట్ శ్రీనివాసరావు జూనియర్ అసిస్టెంట్ సతీష్, కంప్యూటర్ ఆపరేటర్ వలీ, శాఖల సిబ్బంది పాల్గొన్నారు.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్