ప్రజాశక్తి - రాజమహేంద్రవరం రూరల్ : ధవళేశ్వరానికి చెందిన సచివాలయ ఉద్యోగి, నిమిషకవి ఎన్.దేవి వరప్రసాద్ శనివారం ఉదయం గుండెపోటుతో మృతి చెందారు. ఉదయం తన స్వగృహంలో అకస్మాత్తుగా అస్వస్థతకు గురై కుప్పకూలిపోవడంతో ఆయనను కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తరలించే ప్రయత్నం చేసినప్పటికీ అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. దేవి వరప్రసాద్ ప్రస్తుతం బొమ్మూరులోని కలెక్టర్ కార్యాలయంలో సచివాలయ ఉద్యోగిగా విధులు నిర్వహిస్తున్నారు. విధి నిర్వహణలో క్రమశిక్షణతో పాటు సహోద్యోగులు, ప్రజలతో ఎంతో స్నేహపూర్వకంగా మెలుగుతూ అందరి అభిమానాన్ని చూరగొన్నారని సహోద్యోగులు పేర్కొన్నారు. దేవి వరప్రసాద్ ఆకస్మిక మరణ వార్త తెలిసిన వెంటనే కలెక్టర్ కార్యాలయ ఉద్యోగులు, సచివాలయ సిబ్బంది, స్థానికులు తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు. ఆయన మృతి పట్ల పలువురు ఉద్యోగులు, స్నేహితులు తమ ప్రగాఢ సంతాపాన్ని తెలియజేస్తూ, కుటుంబ సభ్యులకు ధైర్యం చేకూరాలని ఆకాంక్షించారు. దేవి వరప్రసాద్‌కు భార్య ఇద్దరు పిల్లలు ఉన్నారు. కుటుంబానికి ఆయనే ప్రధాన ఆధారంగా ఉండడంతో ఆయన మృతి కుటుంబ సభ్యులను తీవ్ర విషాదంలోకి నెట్టి వేసింది. ఈయన మృతి పట్ల గ్రామంలో తీవ్ర విషాదం నెలకొంది.
గుండెపోటుతో సచివాలయ ఉద్యోగి మృతి
4 గంటల క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది జూన్ 20, 2026, 03:59 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం








కామెంట్‌లు (0)