ప్రజాశక్తి-అమలాపురం రూరల్ : అమలాపురం మండలం వన్నె చింతలపూడి అంబేద్కర్ నగర్ గ్రామస్థులు ఆందోళన చేపట్టారు.తుపాన్ ప్రభావం తో 8 రోజులు గా కరెంట్ లేక ఇబ్బందులు పడుతున్నామని, రోడ్డు మీద పడిన కరెంట్ పోల్స్ కూడా తియని పరిస్థితి ఉందని, అధికారులు నిర్లక్ష్యమే ప్రధాన కారణమని అంబేద్కర్ నగర్ గ్రామస్థులు ఆగ్రహం వ్యక్తం చేశారు.ఇప్పటికైనా అధికారులు తక్షణమే కరెంట్ అందించకపోతే కరెంట్ ఆఫీస్ లు ముట్టడిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో వన్నె చింతలపూడి గ్రామస్థులు పాల్గొన్నారు.
అంబేద్కర్ నగర్ గ్రామస్థులు ఆందోళన
1 గంట క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది నవం 04, 2026, 01:52 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం
ట్యాగ్‌లు
సంబంధిత వార్తలు






కామెంట్‌లు (0)