వాషింగ్టన్ : రష్యాపై ఆంక్షలు విధించే బిల్లుకు అమెరికా సెనేట్ శుక్రవారం ఆమోదం తెలిపింది. ఈ బిల్లు అమల్లోకి వస్తే రష్యా నుంచి చమురు, సహా ఇతర ఇంధన ఉత్పత్తులను కొనుగోలు చేసే దేశాలపై 100 శాతం వరకు టారిఫ్‌లు విధించే అవకాశం ఉంది. దీంతో భారత్, చైనా సహా రష్యాతో ఇంధన వాణిజ్యం నిర్వహిస్తున్న దేశాలపై తీవ్ర ప్రభావం పడే అవకాశం ఉందని తెలుస్తోంది.
రష్యా నుంచి చమురు, గ్యాస్ కొనుగోలు చేయడం ద్వారా ఆ దేశ ఆర్థిక వ్యవస్థకు బలం చేకూరుతోందని, తద్వారా ఉక్రెయిన్‌పై యుద్ధాన్ని కొనసాగించేందుకు మాస్కోకు ఆర్థిక వెసులుబాటు లభిస్తోందని అమెరికా భావిస్తోంది. ఈ నేపథ్యంలో రష్యాపై ఆర్థిక ఒత్తిడి పెంచడంతోపాటు, ఆ దేశంతో ఇంధన వాణిజ్యం నిర్వహిస్తున్న దేశాలపై కూడా ఒత్తిడి తీసుకురావాలని ట్రంప్ ప్రభుత్వం యోచిస్తోంది. రిపబ్లికన్ సెనేటర్ లిండ్సే గ్రాహం పేరుతో ప్రవేశపెట్టిన ఈ బిల్లుకు సెనేట్‌లో 86–11 ఓట్లతో ఆమోదం లభించింది. రష్యాపై ఆర్థిక ఆంక్షలను మరింత కఠినతరం చేయడమే బిల్లు ప్రధాన ఉద్దేశంగా పేర్కొంటున్నారు. ఈ బిల్లు అమల్లోకి వస్తే రష్యా నుంచి చమురు కొనుగోలు చేసే దేశాలపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ 100 శాతం వరకు టారిఫ్ విధించే అధికారం పొందే అవకాశం ఉంది. భారత్, చైనాతో పాటు మరో మూడు కీలక దేశాలపై కూడా ఈ నిర్ణయం ప్రభావం చూపే అవకాశం ఉన్నట్లు సమాచారం.








కామెంట్‌లు (0)