mh ad
సోమవారం, 22 జూన్ 2026E-PAPER
మ్యాగజైన్స్

11 బంతుల్లో అర్ధశతకం.. వైభవ్ సూర్యవంశీ చరిత్ర

3 గంటల క్రితం

vamsi
వెబ్ డెస్క్

ప్రచురించబడింది జూన్ 22, 2026, 09:04 పూర్వాహ్నం | 1 నిమిషాల చదవడం

లిస్ట్ ‘ఎ’ క్రికెట్‌లో కొత్త ప్రపంచ రికార్డు

ధంబుల్లా : భారత యువ క్రికెట్ సంచలనం వైభవ్ సూర్యవంశీ మరో అరుదైన ఘనత సాధించాడు. ట్రై-నేషన్ సిరీస్ ఫైనల్లో శ్రీలంక ‘ఎ’ జట్టుపై ఇండియా ‘ఎ’ తరఫున కేవలం 11 బంతుల్లో అర్ధశతకం పూర్తి చేసి లిస్ట్ ‘ఎ’ క్రికెట్ చరిత్రలో అత్యంత వేగవంతమైన హాఫ్ సెంచరీ నమోదు చేసిన బ్యాటర్‌గా నిలిచాడు. కేవలం 15 ఏళ్ల వయసులోనే ఈ రికార్డు సాధించిన వైభవ్, 2005లో శ్రీలంక ఆటగాడు కౌశల్య వీరరత్నే నెలకొల్పిన 12 బంతుల అర్ధశతకం రికార్డును అధిగమించాడు. దూకుడైన బ్యాటింగ్‌తో ప్రత్యర్థి బౌలర్లపై విరుచుకుపడిన అతడు మ్యాచ్‌ను ఏకపక్షంగా మార్చేశాడు. వైభవ్ కేవలం 29 బంతుల్లో 94 పరుగులు చేసి జట్టు విజయానికి కీలక పాత్ర పోషించాడు. అతని ఇన్నింగ్స్‌లో 10 ఫోర్లు, 8 భారీ సిక్సర్లు ఉండటం విశేషం. ఆకాశమే హద్దుగా చెలరేగిన ఈ యువ బ్యాటర్ ఇన్నింగ్స్‌తో ప్రేక్షకులను అలరించాడు.

అసాధారణ ప్రదర్శనకు గాను వైభవ్ సూర్యవంశీకి ‘మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు లభించింది. అతని విధ్వంసకర ఇన్నింగ్స్‌తో ఇండియా ‘ఎ’ జట్టు ట్రై-నేషన్ టైటిల్‌ను కైవసం చేసుకుంది. భారత క్రికెట్‌లో భవిష్యత్తు తారగా గుర్తింపు పొందుతున్న వైభవ్ సూర్యవంశీ, ఈ రికార్డు ఇన్నింగ్స్‌తో మరోసారి తన ప్రతిభను చాటుకున్నాడు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్