mh ad
మంగళవారం, 23 జూన్ 2026E-PAPER
మ్యాగజైన్స్

1000 ఉద్యోగాలకు లే ఆఫ్ - రోబోలతో రీప్లేస్ ..!

1 రోజు క్రితం

Layoffs for 1,000 jobs – replaced by robots!
వెబ్ డెస్క్

ప్రచురించబడింది జూన్ 22, 2026, 11:54 పూర్వాహ్నం | 1 నిమిషాల చదవడం

ఇంటర్నెట్ : పలు ప్రధాన రంగాల్లో కృత్రిమ మేధ, రోబోటిక్స్ గణనీయమైన ప్రభావాన్ని చూపిస్తున్నాయి. ఇప్పటికే చాలామంది ఉద్యోగులు లే ఆఫ్ లతో ఇంటిబాటపట్టారు. దేశీయంగాను, ప్రపంచవ్యాప్తంగానూ పలు కంపెనీల్లో లే ఆఫ్ ల వల్ల నిరుద్యోగుల సంఖ్య గణనీయంగా పెరుగుతోంది..! దీనికి ఎఐ టూల్స్, రోబోలే ప్రధాన కారణంగా మారుతున్నాయి ..! తాజాగా అమెరికాకు చెందిన ఆటోమొబైల్ దిగ్గజం జనరల్ మోటార్స్ 1000కిపైగా ఉద్యోగాలను తొలగించింది. ఆ స్థానాలను రోబోలతో భర్తీ చేసింది. ఈ మార్పు తీవ్ర విమర్శలకు దారితీస్తోంది.


మిషిగన్‌లోని తన కేంద్రకార్యాలయంలో కొలాబరేటివ్ రోబోట్స్ (కోబోట్స్‌)ను జనరల్ మోటార్స్ విధుల్లోకి తీసుకువచ్చింది. వాహనాల అసెంబ్లింగ్‌లో మిగతా ఉద్యోగులతో కలిసి కోబోట్స్ పనిచేస్తున్నాయి. తమ కార్యకలాపాల్లోకి అధునాతన సాంకేతికతను చొప్పించే ప్రయత్నాల్లో భాగంగా ఈ రోబోలను తీసుకొచ్చామని కంపెనీ ప్రతినిధి కెవిన్ కెల్లీ వెల్లడించారు. అన్ని భద్రతా నియమాలను పాటిస్తూనే, తమ ఉత్పత్తులు పోటీని తట్టుకునేలా చూసుకునేందుకు ఈ నిర్ణయాలు తీసుకుంటున్నట్లు చెప్పారు. అయితే జనరల్ మోటార్స్ నిర్ణయంపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. మెషిన్లు తమ ఉద్యోగాలను లాగేసుకుంటున్నాయని ట్రేడ్ యూనియన్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ‘‘వెయ్యి ఉద్యోగాలు పోయాయి.. ఇప్పుడు రోబోలు వచ్చాయి. ఇదే భవిష్యత్తు అంటున్నారు. ఇదే కొనసాగితే.. ప్రజలకు ఉద్యోగాలు ఉండవు’’ అని యూనియన్ ప్రతినిధులు వాపోయారు.


GM offers buyouts as part of cost reduction plan | Fox Business



ఈ ధోరణి ఆటోమోటివ్ పరిశ్రమలో ఆటోమేషన్ వైపు జరుగుతున్న విస్తృత మార్పును ప్రతిబింబిస్తుందని నిపుణులు అంటున్నారు. వేన్ స్టేట్ యూనివర్శిటీ ప్రొఫెసర్ మారిక్ మాస్టర్స్ మాట్లాడుతూ .... 1980లతో పోలిస్తే నేడు వాహనాల అసెంబ్లీకి 50 నుండి 70 శాతం తక్కువ కార్మిక గంటలు అవసరమవుతున్నాయని, తయారీదారులు అధునాతన రోబోటిక్స్, ఆటోమేటెడ్ ఉత్పత్తి సాంకేతికతలలో పెట్టుబడులు పెట్టడం కొనసాగిస్తుండటంతో ఈ సంఖ్య మరింత తగ్గుతుందని అంచనా వేస్తున్నట్లు తెలిపారు.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్