mh ad
సోమవారం, 22 జూన్ 2026E-PAPER
మ్యాగజైన్స్

డిగ్రీ సర్టిఫికెట్లపై ఇండియా బదులు భారత్‌‌గా పేరు మార్పు : ఆరెస్సెస్‌

4 గంటల క్రితం

Rani Durgavati University
వెబ్ డెస్క్

ప్రచురించబడింది జూన్ 22, 2026, 04:14 అపరాహ్నం | 2 నిమిషాల చదవడం

భోపాల్‌ : రాష్ట్రీయ స్వయం సేవక్‌ ‌సంఘ్‌ (ఆర్‌ఎస్‌ఎస్‌) ‌విద్యా వ్యవస్థలోకి చొచ్చుకుపోతోంది. ఆరెస్సెస్‌ అనుబంధ సంస్థ ‘న్యాస్‌’ ‌లేవనెత్తిన డిమాండ్‌ ‌మేరకు మధ్యప్రదేశ్‌లోని జబల్‌‌పూర్‌‌లో ఉన్న రాణి దుర్గావతి విశ్వవిద్యాలయం విద్యార్థులకందజేసే డిగ్రీ సర్టిఫికెట్లపై ‘ఇండియా’ అనే పదానికి బదులుగా ‘భారత్‌’గా మార్చింది. భారతదేశంలో విద్యకు సంబంధించిన ఎంతో కీలకమైన సర్టిఫికెట్లపై ‘భారత్‌’గా పేరుమార్చిన తొలి విశ్వవిద్యాలయంగా రాణి దుర్గావతి యూనివర్సిటీ నిలిచింది.

కాగా, ఆదివారం రాణి దుర్గావతి విశ్వవిద్యాలయ 36వ స్నాతకోత్సవంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము విద్యార్థులకు డిగ్రీలను ప్రదానం చేశారు. వీరికందించిన డిగ్రీ పత్రాలపై ఇండియా బదులుగా ‘భారత్‌’ అని పేర్కొనడం జరిగింది. అధికారిక సమాచారంలోనూ, క్యాంపస్‌ ‌సైన్‌‌బోర్డ్‌లపై కూడా ఈ విశ్వవిద్యాలయం ‘భారత్‌’ అనే పేరును మార్చేసింది. ఆఖరుకు ఈ స్నాతకోత్సవ కార్యక్రమ ఆహ్వానపత్రికల్లో కూడా ‘భారత్‌’ అనే చేర్చింది.

అకడమిక్ పత్రాలు, సర్టిఫికెట్లు, కోర్స్‌ ‌మెటీర్సియల్స్‌‌లో అన్నింటిలో 'భారత్' అనే పదాన్ని తిరిగి ఉపయోగించాలని డిమాండ్‌ ‌చేస్తూ.. ఆర్‌ఎస్‌ఎస్ అనుబంధ సంస్థ 'శిక్షా సంస్కృతి ఉత్థాన్ న్యాస్' జాతీయ స్థాయి ప్రచారం చేపట్టింది. ఈ ప్రచారం నేపథ్యంలోనే తాజాగా మధ్యప్రదేశ్‌ ‌రాణి దుర్గావతి విశ్వవిద్యాలయం ఇప్పటివరకు ఉన్న ఇండియాకు బదులుగా ‘భారత్‌’ అనే పదాన్ని మార్చింది. ‘భారత్‌’ అనే పదం మార్పు కోసం భారతదేశం నలుమూలల నుండి సంతకాలను సేకరించేందుకు 'న్యాస్' ఒక ప్రచారాన్ని నిర్వహిస్తోంది. మధ్యప్రదేశ్‌‌లో దేవి అహల్య విశ్వవిద్యాలయం అధికారిక సమాచార మార్పిడిలో భారత్‌ ‌పదాన్నే ఉపయోగిస్తోంది. అయితే రాణి దుర్గావతి విశ్వవిద్యాలయమే ఏకంగా భారత్‌ అనే పదంతోనే డిగ్రీ సరిఫికెట్లను జారీ చేసిన దేశంలో తొలి యూనివర్సిటీ కావడం గమనార్హం.

2023 సెప్టెంబర్‌‌లో జి20 సదస్సులో ప్రధాని నరేంద్రమోడీ నేమ్‌‌ప్లేట్‌‌పై ఇండియాకు బదులుగా భారత్‌ ‌అని ఉండడంతో ఇండియా వర్సెస్‌ ‌భారత్‌ ‌వివాదం మొదటిసారిగా తెరపైకి వచ్చింది. ఆ తర్వాత రాష్ట్రపతి ముర్ము ‘భారత్ రాష్ట్రపతి’ అనే బిరుదుతో అధికారిక జీ20 విందు ఆహ్వానాలను పంపారు. అయితే ఆ సమయంలో కేంద్ర ప్రభుత్వం ఇండియాకు బదులుగా భారత్‌ అనే పేరు మార్చుతూ రాజ్యాంగంలోని 1వ అధికరణకు సవరణలు తీసుకురావచ్చనే ఊహాగానాలు వచ్చాయి. అప్పటి నుంచి ఇప్పటివరకు మోడీ ప్రభుత్వం ఆవిధమైన చర్యలు చేపట్టలేదు. కానీ ఆరెస్సెస్‌ చాపకింద నీరులా ఆవిధమైన ప్రయత్నాలు చేస్తూనే ఉంది. ఆరెస్సెస్‌ ‌అనుబంధ సంస్థ న్యాస్‌ జాతీయ విద్యావిధానంలో మార్పులు చేసేందుకు కీలక పాత్ర పోషించింది. భారత్ అనే పేరుకు లోతైన చారిత్రక, సాంస్కృతిక ప్రాముఖ్యత ఉందని న్యాస్ ప్రధాన కార్యదర్శి అతుల్ కొఠారి పేర్కొన్నారు. ‘ఇండియా’ అనేది కేవలం ఒక పేరు మాత్రమే. కానీ భారత్ అనేది ఒక భావన, మన పూర్వీకుల వారసత్వం అని ఆయన అన్నారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్