mh ad
ఆదివారం, 28 జూన్ 2026E-PAPER
మ్యాగజైన్స్

సిజెపి నిరసనలో పాల్గొన్న సోనమ్‌వాంగ్‌చుక్‌

4 గంటల క్రితం

Sonam Wangchuk joins CJP protest
వెబ్ డెస్క్

ప్రచురించబడింది జూన్ 28, 2026, 02:47 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

న్యూఢిల్లీ : పరీక్ష‍ల్లో అవకతవకలపై విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ రాజీనామాను డిమాండ్‌ చేస్తూ కాక్రోచ్‌ జనతా పార్టీ (సిజెపి) చేపడుతున్న నిరసనలో వాతావరణ కార్యకర్త సోనమ్‌ వాంగ్‌చుక్‌ పాల్గొన్నారు. ఆదివారం జంతర్‌ మంతర్‌కు చేరుకున్న ఆయన నిరాహార దీక్షను ప్రారంభించారు. నీట్‌ సహా పలు పరీక్ష‍ల్లో జరుగుతున్న అక్రమాలపై జవాబుదారీతనం కోరుతూ జూన్‌ 20 నుండి సిజెపి ఇక్కడ నిరసన చేపడుతున్న సంగతి తెలిసిందే. రెండు నిమిషాల మౌనం పాటించిన అనంతరం వాంగ్‌చుక్‌ నిరాహార దీక్ష‍లో కూర్చున్నారు. దీక్ష‍కు ముందు, వాంగ్‌చుక్, సిజెపి వ్యవస్థాపకుడు అభిజీత్‌ దీప్కే రాజ్‌ఘాట్‌ సందర్శించి, మహాత్మాగాంధీకి నివాళులర్పించారు. పలువురు రైతు నేతలు కూడా ఈ నిరసనలో పాల్గొన్నారు. ఈ సమస్య కేవలం ఒక పరీక్షకు మాత్రమే పరిమితం కాలేదని, విద్యా వ్యవస్థ పట్ల పారదర్శకత మరియు విశ్వసనీయతకు సంబంధించిన విస్తృత ఆందోళనలను ఇది ప్రతిబింబిస్తోందని అభిజీత్ దిప్కే పేర్కొన్నారు. ఈ నిరసనలో విద్యార్థులు, పౌర సంఘాల నేతలు పాల్గొన్నారు. అయితే , ఉత్తరప్రదేశ్‌, హర్యానా, పంజాబ్‌లకు చెందిన తమను జంతర్‌మంతర్‌ వెళ్లకుండా అడ్డుకున్నారని, గృహనిర్బంధం విధించారని పలురురు రైతు నేతలు ఎక్స్‌లో పేర్కొన్నారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్