mh ad
శుక్రవారం, 19 జూన్ 2026E-PAPER
మ్యాగజైన్స్

లోయలో మొహరం ఊరేగింపులకు అనుమతినివ్వాలి : ముఫ్తీ

2 రోజుల క్రితం

Mehbooba urges authorities
వెబ్ డెస్క్

ప్రచురించబడింది జూన్ 16, 2026, 02:50 అపరాహ్నం | 2 నిమిషాల చదవడం

శ్రీనగర్ : జమ్ముకాశ్మీర్ లోయలో మొహరం ఊరేగింపుకు అనుమతించాలని పీపుల్స్ డెమోక్రటిక్ పార్టీ (పిడిపి) మెహబూబా ముఫ్తీ మంగళవారం అధికారులకు విజ్ఞప్తి చేశారు. ఇరాన్ పరిణామాలపై జరిగిన నిరసనల సమయంలో పబ్లిక్ సేఫ్టీ యాక్ట్ (పి ఎస్ ఎ) కింద కేసులు నమోదు చేసిన యువకులను విడుదల చేయాలని కోరారు. మతపరమైన ఊరేగింపులు ఈ ప్రాంత సాంస్కృతిక, ఆధ్యాత్మిక వారసత్వంలో అంతర్భాగమని, ప్రజల మనోభావాలను, రాజ్యాంగ పరమైన హక్కులను గౌరవించే రీతిలో వాటికి తగిన ఏర్పాట్లు చేయాలని పేర్కొన్నారు. “ మొహరం అనేది ఆత్మపరిశీలన, త్యాగం, స్మరణకు సంబంధించిన సమయం. ఇమామ్ హుస్సేన్ ప్రతిపాదించిన విలువలు న్యాయం, కరుణ, మానవ గౌరవం కోసం నిలబడేలా ప్రజలకు స్ఫూర్తినిస్తూనే ఉన్నాయి. సంతాపం తెలిపేవారు ఈ పవిత్ర దినాలను స్వేచ్ఛగా, ప్రశాంతంగా ఆచరించగలిగేలా చూడటం ప్రభుత్వ బాధ్యత” అని పేర్కొన్నారు. మతపరమైన సమావేశాలు, ఊరేగింపులు సజావుగా జరిగేందుకు వీలుగా ట్రాఫిక్ నిర్వహణ, ఆరోగ్య సంరక్షణ సౌకర్యాలు, పారిశుధ్యం, తాగునీరు, విద్యుత్, ఇతర నిత్యావసర సేవల కోసం తగిన చర్యలు చేపట్టాలని ముఫ్తీ అధికారులను కోరారు. ఇరాన్‌కు సంబంధించిన పరిణామాలపై జరిగిన నిరసనల్లో పాల్గొన్న పలువురు యువకులపై పి ఎస్ ఎ కింద కేసులు నమోదు చేసి, వారిని జమ్మూకాశ్మీర్ బయట ఉన్న జైళ్లకు తరలించారన్న వార్తలపై ఆందోళన వ్యక్తం చేస్తూ, అటువంటి చర్యలు “తీవ్ర ఆందోళనకరమైనవి,యువతను మరింత దూరం చేసే ప్రమాదం ఉన్నవి” అని మెహబూబా పేర్కొన్నారు. “మొహరం అనేది ప్రజలు కర్బలాలో జరిగిన త్యాగాలను స్మరించుకుంటూ సంతాపం తెలిపే సమయం. ఇది ఆత్మపరిశీలన, కరుణ, బాధలో ఉన్నవారికి సంఘీభావం ప్రకటించే కాలం. ఇటువంటి సమయంలో శిక్షలతో వారిని మరింత బాధపెట్టడానికి బదులుగా ప్రభుత్వం వారితో మమేకమై, వారి గాయాలను మాన్పేలా వ్యవహరించాలి,” అని ఆమె అన్నారు.
ఇస్లామిక్ నూతన సంవత్సరంలో మొదటి నెల అయిన మొహరం జమ్మూకాశ్మీర్ లో బుధవారం ప్రారంభం కానుంది. 10వ రోజున ఆషూరా (జూన్ 17) ఊరేగింపులు నిర్వహిస్తారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్