mh ad
శుక్రవారం, 19 జూన్ 2026E-PAPER
మ్యాగజైన్స్

భారీగా తగ్గిన బంగారం, వెండి ధరలు

1 గంట క్రితం

Gold Prices
వెబ్ డెస్క్

ప్రచురించబడింది జూన్ 19, 2026, 11:03 పూర్వాహ్నం | 1 నిమిషాల చదవడం

న్యూఢిల్లీ : దేశీయంగా బంగారం, వెండి ధరలు శుక్రవారం భారీగా తగ్గాయి. దేశీయ బులియన్ మార్కెట్లో పదిగ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.1,45,860 వద్ద కొనసాగుతోండగా.. శుక్రవారం ఒక్కరోజే రూ.3650 తగ్గింది. 22 క్యారెట్ల ధర రూ.1,33,700 వద్ద ట్రేడవుతోండగా.. నేడు రూ.3350 పడిపోయింది.

ప్రస్తుతం దేశంలోని వివిధ ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు ఈక్రింది విధంగా ఉన్నాయి. దేశ రాజధాని ఢిల్లీలో 24 క్యారెట్ల బంగారం ధర రూ.1,46,010 వద్ద కొనసాగుతోండగా.. 22 క్యారెట్ల రేటు రూ.1,33,850గా ఉంది. హైదరాబాద్‌లో 24 క్యారెట్ల బంగారం ధర రూ.1,45,860గా ఉండగా.. 22 క్యారెట్ల ధర రూ.1,33,700 వద్ద ట్రేడవుతోంది. ముంబయిలో 24 క్యారెట్ల గోల్డ్ రేటు రూ.1,45,860గా ఉండగా.. 22 క్యారెట్ల రేటు రూ.1,33,700 వద్ద కొనసాగుతోంది. చెన్నైలో 24 క్యారెట్ల గోల్డ్ రేటు రూ.1,48,040 వద్ద కొనసాగుతోండగా.. ఇవాళ ఒక్కరోజే రూ.4140 తగ్గింది. 22 క్యారెట్ల రేటు రూ.1,35,700 వద్ద ట్రేడవుతోండగా.. నేడు రూ.3800 మేర క్రాష్ అయింది. బెంగళూరులో 24 క్యారెట్ల బంగారం ధర రూ.1,45,860గా ఉండగా.. 22 క్యారెట్ల రేటు రూ.1,33,700గా ఉంది. వెండి ధరలు కూడా భారీగా కుప్పకూలాయి. హైదరాబాద్‌లో కేజీ వెండి ధర రూ.2.55 లక్షలుగా ఉండగా.. గురువారం రూ.2.70 లక్షలుగా ఉంది. ఒక్కరోజే రూ.15 వేల తగ్గముఖం పట్టింది. చెన్నైలో కేజీ వెండి రూ.2.55 లక్షలుగా ఉంది. బెంగళూరులో కేజీ సిల్వర్ ధర రూ.2.50 లక్షలుగా ఉండగా.. నిన్న రూ.2.60 లక్షలుగా ఉంది.


అమెరికా-ఇరాన్ మధ్య శాంతి ఒప్పందంపై సంతకాలు చేయడం, హర్ముజ్ జలసంధి తెరుచుకోవడం, ముడి చమురు ధరలు భారీగా పడిపోవడంతో ద్రవ్యోల్బణంపై ఆశలు రేకెత్తడంతో ఇన్వెస్టర్లు ఈక్విటీలవైపు మళ్లుతున్నట్లు విశ్లేషకులు పేర్కొంటున్నారు. దీంతో బంగారం డిమాండ్ తగ్గడంతో ధరలు కుప్పకూలాయని అన్నారు.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్