గురువారం, 17 సెప్టెంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

‘ఆకాశంలో ఒక తార’ రిలీజ్‌ డేట్ ఖరారు

1 గంట క్రితం

movies
వెబ్ డెస్క్

ప్రచురించబడింది సెప్టెం 17, 2026, 01:31 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

- నవంబర్ 20న థియేటర్లలోకి దుల్కర్ సల్మాన్

హైదరాబాద్: దుల్కర్ సల్మాన్ హీరోగా పవన్ సాదినేని దర్శకత్వంలో తెరకెక్కుతున్న తెలుగు చిత్రం ‘ఆకాశంలో ఒక తార’ థియేట్రికల్ రిలీజ్‌కు సిద్ధమవుతోంది. ఈ చిత్రం నవంబర్ 20న ప్రేక్షకుల ముందుకు రానుంది. గీతా ఆర్ట్స్, స్వప్న సినిమా, లైట్‌బాక్స్ మీడియా సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. ఈ సినిమాలో కొత్త నటి సాత్విక వీరవల్లి కథానాయికగా నటిస్తోంది. దుల్కర్ సల్మాన్ కృష్ణ అనే పాత్రలో కనిపించనున్నారు. గ్రామీణ నేపథ్యంలో సాగే ఈ కథ ప్రధాన పాత్రల ప్రేమ జీవితాన్ని కేంద్రంగా చేసుకుని రూపొందినట్లు తెలుస్తోంది. శృతి హాసన్ కీలక పాత్రలో నటిస్తున్నారు. సినిమాకు జి.వి. ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తున్నారు. దుల్కర్ సల్మాన్ పుట్టినరోజు సందర్భంగా జూలై 28న చిత్రంలోని ‘కుట్టి కుట్టి పూవే’ పాటను విడుదల చేశారు. ఈ పాటకు ప్రేక్షకుల నుంచి స్పందన లభించింది. గుణ్ణం గంగరాజు రచన, స్క్రీన్‌ప్లే అందించగా, పవన్ సాదినేని, వసంత్ జూరు కథను రూపొందించారు. సుజిత్ సారంగ్ ఛాయాగ్రహణం, ప్రవీణ్ కెఎల్ ఎడిటింగ్ బాధ్యతలు నిర్వహిస్తున్నారు. శ్వేతా సాబు సిరిల్ ప్రొడక్షన్ డిజైన్ చేస్తున్నారు. సురేశ్ పరుచూరి కో-డైరెక్టర్‌గా వ్యవహరిస్తున్నారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్