ఆదివారం, 18 అక్టోబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

కరువు అల్లాడుతున్న ప్రజలకు ఉపాధి పనులు కల్పించాలి : సిఐటియు

17 సెప్టెంబర్, 2026

citu
వెబ్ డెస్క్

ప్రచురించబడింది సెప్టెం 17, 2026, 02:13 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

ప్రజాశక్తి-అనకాపల్లి : అనకాపల్లి జిల్లా వ్యాప్తంగా తీవ్ర వర్షాభావ పరిస్థితులు నెలకొని, రైతాంగం, వ్యవసాయ కూలీలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని వెంటనే అన్ని గ్రామాల్లో ఉపాధి హామీ పనులు కల్పించి గ్రామీణ ప్రజలను ఆదుకోవాలని సిఐటియు జిల్లా కార్యదర్శి ఆర్ .రాము డిమాండ్ చేశారు. జిల్లాలో ఖరీఫ్ సీజన్ లో 60% వరకు వర్షాభావం ఏర్పడిందని తెలిపారు. రిజర్వాయర్లలో నీటి మట్టం అడుగంటింది. భూగర్భ జలాలు 300 అడుగులకు పడిపోయాయన్నారు. పనులు లేక అనకాపల్లి జిల్లాలో వేలాది మంది వ్యవసాయ కూలీలు, వలస వెళ్ళే పరిస్థితి నెలకొందన్నారు. ఉపాధి హామీ పథకం ద్వారా పనులు కల్పించి పేదలను ఆదుకోవాలని అనకాపల్లి జిల్లాను కరువు ప్రాంతంగా ప్రకటించి తక్షణ సహాయ చర్యలు తీసుకొని సంవత్సరానికి 200 రోజులు పని కల్పించాలని, ఎకరానికి 25,000 నష్టపరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్