బుధవారం, 09 సెప్టెంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

నివేదా ‘శ్రీమతి’ ఫస్ట్ లుక్

1 గంట క్రితం

srmiati
వెబ్ డెస్క్

ప్రచురించబడింది సెప్టెం 09, 2026, 06:31 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

నటి నివేదా థామస్ విభిన్న కథలతో ప్రేక్షకుల్ని అలరిస్తారు. '35 ఇది చిన్న కథ కాదు` చిత్రంలో తల్లి పాత్రలో నటించి మెప్పించారు. సుమారు రెండేళ్ల గ్యాప్ తర్వాత ఆమె 'శ్రీమతి` చిత్రంలో నటిస్తోంది. తాజాగా మేకర్స్ ఈ చిత్రంలో నివేదా ఫస్ట్ లుక్ ను విడుదల చేశారు. దీనికి మేకర్స్ 'ప్రతి ఇంటి హృదయం నుంచీ ఒక కథ ఉద్భవిస్తుంది.. అది మనందరికీ తెలిసిన, మనం ప్రేమించే.. మనం జీవించే కథ' అని క్యాప్షన్ ను జోడించారు. దీన్నిచూస్తే ఆమె ఓ గృహిణి పాత్రలో నటిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ చిత్రాన్ని 'ప్రైమ్ షో ఎంటర్‌టైన్‌మెంట్స్' బ్యానర్‌పై నిరంజన్ రెడ్డి, చైతన్య రెడ్డి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. దర్శకుడు విశ్వక్ ఖండేరావు దర్శకత్వం వహిస్తున్నారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్