బుధవారం, 09 సెప్టెంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

సచివాలయం ఉద్యోగుల మెరుపు ధర్నా

57 నిమిషాల క్రితం

protest
వెబ్ డెస్క్

ప్రచురించబడింది సెప్టెం 09, 2026, 07:50 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

- కలెక్టరేట్ వద్ద బైఠాయింపు

ప్రజాశక్తి-విజయనగరం టౌన్ : సచివాలయ ఉద్యోగులు సమస్యలు పరిష్కారం చేయాలని కోరుతూ జిల్లా కలెక్టర్ ను కలిసేందుకు వచ్చిన ఉద్యోగులను కనీసం కలెక్టర్, జెసిలు కలవడానికి తమ సమస్యలు వినేందుకు ఇష్టపెట్టుకోకపోవడంతో కలెక్టరేట్ వద్ద బైఠాయించడం జరిగిందన్నారు. నిరసన కార్యక్రమాన్ని ఉద్దేశించి సచివాలయ ఉద్యోగులు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బి.శంకరరావు మాట్లడుతూ21 డిపార్టుమెంటు నుంచి సచివాలయం ఉద్యోగులు రావడం జరిగిందన్నారు. ఇటీవల విశాఖ లో జరిగిన ఉద్యమంలో వారం రోజుల్లో సమస్యలు పరిష్కారం చేస్తామనీ అధికారులు హామీ ఇవ్వడం జరిగిందన్నారు. జిల్లాలో ఉన్న సచివాలయ ఉద్యోగులు మా సమస్యలను జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకొచ్చేందుకు వస్తె కలిసేందుకు అవకాశం ఇవ్వకపోవడం దారుణమన్నారు. ప్రభుత్వ ఉద్యోగుల్లో అత్యధిక శక్తివంతమైన ఉద్యోగులుగా సచివాలయ ఉద్యోగులు ఉన్నారన్నారు. జిల్లా కలెక్టరేట్, జెసినీ కలవడానికి వస్తె కనీసం మాతో మాట్లాడేందుకు అనుమతులు ఇవ్వకపోవడం దారుణమన్నారు. పదోన్నతులు లేవు, ప్రోహిబిషన్ పీరియడ్ లో రావల్సిన డబ్బులు ఇవ్వలేదు, వేతనాలు పెరుగుదల లేదు ఇటువంటి సమస్యలు విన్నవించేందుకు వస్తె అధికారులు కలిసేందుకు అవకాశం ఇవ్వకపోవడంతో కలెక్టరేట్ వద్ద బైఠాయించడం జరిగిందన్నారు. వారం రోజుల్లో మా సమస్యలు పరిష్కారం చేయకుంటే పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని హెచ్చరించారు. ధర్నాలో అధిక సంఖ్యలో సచివాలయ ఉద్యోగులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్