mh ad
శుక్రవారం, 19 జూన్ 2026E-PAPER
మ్యాగజైన్స్

80 డాలర్ల దిగువకు చమురు ధర

1 రోజు క్రితం

crude oil
వెబ్ డెస్క్

ప్రచురించబడింది జూన్ 18, 2026, 12:53 పూర్వాహ్నం | 1 నిమిషాల చదవడం

న్యూయార్క్‌ : పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్తతలు సల్లారుతుండటంతో అంతర్జాతీయ మార్కెట్లో ముడిచమురు ధరలు భారీగా తగ్గుముఖం పట్టాయి. అమెరికా-ఇరాన్ మధ్య కుదిరిన ప్రాథమిక శాంతి ఒప్పందమే ఇందుకు ప్రధాన కారణం. గతంలో ఎగబాకిన ధరలతో పోలిస్తే.. ఈ వారం ప్రారంభంలో బ్రెంట్ క్రూడ్ ధర మూడు నెలల కనిష్టానికి చేరుకుని మార్చి నెల తర్వాత మొదటిసారిగా 80 డాలర్ల మార్కు కంటే దిగువకు పడిపోయింది. బుధవారం అంతర్జాతీయ మార్కెట్లో వెస్ట్ టెక్సాస్ ఇంటర్మీడియట్ క్రూడ్ బ్యారెల్‌కు 76.46 డాలర్ల వద్ద, బ్రెంట్ క్రూడ్ బ్యారెల్‌కు 79.41 డాలర్ల వద్ద నమోదయ్యాయి. ఇరు దేశాల మధ్య శాంతి ఒప్పంద ప్రకటన వెలువడినప్పటి నుండి చమురు ధరలు దాదాపు 5 శాతం మేర క్షీణించాయి.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్