న్యూఢిల్లీ : ఉద్యోగుల ప్రావిడెంట్ ఫండ్ (ఇపిఎఫ్) సభ్యుల నిధికి ఎట్టకేలకు వడ్డీ జమ చేయడానికి కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. 2025-26 ఆర్థిక సంవత్సరానికి గాను సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ (సిబిటి) ప్రతిపాదించిన 8.25 శాతం వార్షిక వడ్డీ రేటుకు కేంద్ర ఆర్థిక శాఖ అధికారికంగా ఆమోదం తెలిపింది. గతేడాదితో పోలిస్తే ఈసారి నోటిఫికేషన్ విడుదలవడంలో దాదాపు నెల రోజులు ఆలస్యమయ్యింది. జూన్ నెలాఖరులోనే వడ్డీ డబ్బులు నేరుగా చందాదారుల ఖాతాల్లో జమ కానున్నాయి. గతంలో కేంద్ర ఆమోదం లభించాక నిధుల జమకు సమయం పట్టేది.. కానీ ఈసారి ఇపిఎఫ్‌ఒ ప్రవేశపెట్టిన నూతన సాంకేతిక వ్యవస్థ ద్వారా అనుమతి వచ్చిన వెంటనే వేగంగా ఖాతాల్లోకి నిధులు చేరనున్నాయి. ఇక గత పదేళ్ల వడ్డీ రేట్లను పరిశీలిస్తే.. 2015-16లో గరిష్టంగా 8.8 శాతం, 2020-21లో అత్యల్పంగా 8.10 శాతం వడ్డీ లభించగా.. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంతో కలిపి వరుసగా మూడో ఏడాది కూడా 8.25 శాతం వడ్డీ రేటును కేంద్రం యథాతథంగా కొనసాగిస్తుండటం గమనార్హం.
ఈ నెలలోనే పిఎఫ్ వడ్డీ జమ
11 గంటల క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది జూన్ 19, 2026, 12:46 పూర్వాహ్నం | 1 నిమిషాల చదవడం








కామెంట్‌లు (0)