mh ad
శుక్రవారం, 19 జూన్ 2026E-PAPER
మ్యాగజైన్స్

రూ.30,000 కోట్లతో అతిపెద్ద పబ్లిక్ ఇష్యూ..!

11 గంటల క్రితం

ipo
వెబ్ డెస్క్

ప్రచురించబడింది జూన్ 19, 2026, 12:41 పూర్వాహ్నం | 1 నిమిషాల చదవడం

ముంబయి : నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ (ఎన్‌ఎస్‌ఇ) తన ప్రతిపాదిత ప్రారంభ పబ్లిక్ ఆఫరింగ్ (ఐపిఒ) కోసం మార్కెట్ నియంత్రణ సంస్థ సెబీకి డ్రాఫ్ట్ రెడ్ హెరింగ్ ప్రాస్పెక్టస్ (డిఆర్‌‌హెచ్‌‌పి) దాఖలు చేసింది. సుమారు రూ. 30,000 కోట్ల విలువతో రానున్న ఈ ఐపిఒ పూర్తిగా ఆఫర్ ఫర్ సేల్ (ఒఎఫ్‌ఎస్‌) రూపంలోనే ఉండనుండగా.. ఇది భారత కార్పొరేట్ చరిత్రలోనే అత్యంత భారీ పబ్లిక్ ఇష్యూగా నిలిచే అవకాశం ఉంది. ఇటీవలే సెబీ నుంచి నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ (ఎన్‌ఒసి) లభించడం.. ఆపై ఎన్‌ఎస్‌ఇ బోర్డు పబ్లిక్ ఇష్యూకు ఆమోదం తెలపడంతో దశాబ్ద కాలంగా నిరీక్షిస్తున్న ఈ లిస్టింగ్ ప్రక్రియకు ఎట్టకేలకు సర్వసన్నద్ధమైంది. షేర్లు ప్రత్యర్థి ఎక్స్ఛేంజ్ అయిన బిఎస్‌ఇలో లిస్ట్ కానున్నాయి.​

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్