శాన్‌ప్రాన్సిస్కో : ప్రముఖ ఫిన్‌టెక్ ప్లాట్‌ఫామ్ క్రెడ్ వ్యవస్థాపకుడు కునాల్ షా ప్రపంచవ్యాప్తంగా అత్యధిక మంది వినియోగించే మెసేజింగ్ యాప్ వాట్సప్ నూతన సిఇఒగా నియమితులయ్యారు. 2019 నుంచి ఆ బాధ్యతలు నిర్వహిస్తున్న విల్ కాథ్‌కార్ట్ స్థానంలో కునాల్ నియమితులైనట్లు మెటా సిఇఒ మార్క్ జుకర్‌బర్గ్ అధికారికంగా ప్రకటించారు. ఈ కీలక నియామకంతో పాటు.. క్రెడ్‌లో మెటా సంస్థ రూ. 8,550 కోట్ల భారీ పెట్టుబడిని ప్రకటించింది. 2018లో కునాల్ షా స్థాపించిన క్రెడ్ ప్రస్తుతం దేశంలోని క్రెడిట్ కార్డు బిల్లు చెల్లింపుల్లో 40 శాతానికి పైగా వాటాతో 1.7 కోట్ల మంది నెలవారీ వినియోగదారులను కలిగి ఉంది. ‘క్రెడ్‌ను అద్భుతమైన టెక్ కంపెనీగా తీర్చిదిద్దిన కునాల్ తన నిర్మాణ దృక్పథంతో వాట్సప్ వినియోగదారులకు, వ్యాపారులకు మరిన్ని మెరుగైన సేవలు అందించడంలో కీలక పాత్ర పోషిస్తారని నమ్ముతున్నాను.’ అని జుకర్‌బర్గ్ పేర్కొన్నారు. కునాల్ షా వైదొలగడంతో ప్రస్తుత స్ట్రాటజీ, ఫైనాన్స్ బాధ్యతల్లో ఉన్న మిథున్ సంపత్ క్రెడ్ తాత్కాలిక సిఇఒగా వ్యవహరించనున్నారు.
వాట్సప్ కొత్త సిఇఒగా కునాల్ షా
1 గంట క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది జూన్ 22, 2026, 10:49 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం








కామెంట్‌లు (0)