mh ad
సోమవారం, 22 జూన్ 2026E-PAPER
మ్యాగజైన్స్

Print Editionఆంధ్రప్రదేశ్ సైన్స్-టెక్నాలజీ శాఖ నూతన కార్యదర్శిగా హనుమంతు పురుషోత్తం

2 గంటల క్రితం

Hanumanthu Purushotham
వెబ్ డెస్క్

ప్రచురించబడింది జూన్ 22, 2026, 11:09 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

ప్రజాశక్తి ప్రత్యేక ప్రతినిధి - అమరావతి : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సైన్స్, టెక్నాలజీ అండ్ ఇన్నోవేషన్‌శాఖ నూతన కార్యదర్శిగా హనుమంతు పురుషోత్తం సచివాలయంలో బాధ్యతలు స్వీకరించారు. ఇప్పటి వరకు ఇన్‌‌ఛార్జి హోదాలో బాధ్యతలు నిర్వర్తిస్తున్న ప్రిన్సిపల్ సెక్రటరీ కాంతిలాల్ దండే నుంచి ఆయన బాధ్యతలు స్వీకరించారు. అనంతరం రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సాయిప్రసాద్‌‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. శాస్త్రవేత్తగా, ఆవిష్కరణల ప్రోత్సాహకులుగా, విద్యావేత్తగా, పరిపాలనాధికారిగా గుర్తింపు పొందిన ఆయన సైన్స్ టెక్నాలజీ, ఇన్నోవేషన్, పరిశోధన, అభివృద్ధి, మేధో సంపత్తి హక్కులు, సాంకేతిక పరిజ్ఞాన బదిలీ, సంస్థాగత అభివృద్ధి రంగాల్లో దాదాపు 4 దశాబ్దాల వివిధ స్థాయిల్లో పనిచేశారు. దేశంలోని ప్రముఖ జాతీయ సంస్థల్లో కూడా కీలక బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుత బాధ్యతలు స్వీకరించడానికి ముందు పురుషోత్తం కేంద్ర ప్రభుత్వ విజ్ఞాన, సాంకేతిక మంత్రిత్వశాఖ పరిధిలోని నేషనల్ రీసెర్చ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్‌‌కు ఛైర్మన్-మేనేజింగ్ డైరెక్టర్‌గా పనిచేశారు. అలాగే ఆంధ్రప్రదేశ్ మెడ్‌టెక్ జోన్, ఆంధ్ర యూనివర్సిటీ చైర్ ప్రొఫెసర్‌గా కూడా సేవలందించారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్